మీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం

Jagan ,Acchenaidu
Jagan ,Acchenaidu

అమరావతి: అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తామని సియం జగన్‌ హామీ ఇచ్చారని, దీన్ని స్వాగతిస్తున్నట్లు టిడిఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు తెలిపారు. బిఏసి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కరవు పరిస్థితులపై కూడా చర్చించాలని కోరామన్నారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో పొలిటికల్‌ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని, రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కూడా చర్చకు డిమాండ్‌ చేశామన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం మంచిదేనని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/