టీ 20కి మేము సర్వం సిద్ధం -డుసెన్

రేపు ఆదివారం జరుగు మ్యాచ్ కి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన సౌత్ ఆఫ్రికన్ బాట్స్మెన్ డుసెన్

బెంగుళూరు: ఈ ఆదివారం ఇండియా సౌత్ ఆఫ్రికా జట్లు ఫైనల్ టి 20 లో తలపడనుండగా ఆ జట్టు బాట్స్మెన్ రాస్సీ వాన్ డెర్ డుసెన్ “ప్రపంచంలో అత్యంత బలమైన జట్టులలో ఒకటని” ఇండియన్ క్రికెట్ జట్టు ని కొనియాడారు. తాము ఏ సవాలునైన స్వీకరించాచానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మొదటి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండవది ఇండియన్ టీం గెలిచి సిరీస్ ని 1-0 నమోదు చేసిందని దురదృష్టవశాత్తు మొదటి టీ20 రద్దవగా మాకు సిరీస్ ని సమం చేయటానికి రెండవ అవకాశం వాచినట్టు రెండవ టీ20 లో సౌత్ ఆఫ్రికా చివరి 3 ఓవర్లలో 23 స్కోర్ చేయటంవల్ల మ్యాచ్ పోయింది కానీ క్రెడిట్ భారత బౌలర్ర్లకు దక్కుతుందన్నారు.165 మంచి స్కోర్ అయినా కానీ ఇంకో 10 నుంచి 15 రన్స్ చేసి ఉంటె గెలిచే వాళ్లమని వాపోయారు.
చివరి మ్యాచ్ నుంచి తాము చాల పాఠాలు నేర్చుకున్నామని ఇప్పుడు అన్ని విధాలుగా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
రేపు ఆదివారం జరగబోయే టీ20కి తాము సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
https://www.vaartha.com/news/sports/