కొత్త సిపి కోసం చూస్తున్నాం : హోం మంత్రిత్వ శాఖ

New Delhi: ఢిల్లికి నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిపి)ను నియమించడానికి చూస్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుత సిపి ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఢిల్లి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని, త్వరలో తేదీలను ప్రకటించనున్నారని, మోడల్ కోడ్ అమల్లోకి వస్తుందని తమకు తెలుసునని పేర్కొంటూ తమ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఢిల్లి శాసనసభకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్నది. ఫలితాలను ఫిబ్రవరి 11న వెల్లడిస్తారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/