ఐపిల్‌ కోసం ఆసియాకప్‌ షెడ్యుల్‌ను మార్చబోం

పిసిబి సీఈవో వసీం ఖాన్‌

vasim khan
vasim khan

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు( పిసిబి) భారత్‌ పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) కోసం ఆసియా కప్‌ను షెడ్యుల్‌ ని మార్చబోమని పిసిబి స్పష్టం చేసింది. మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. ఆసియా కప్‌ కు సెప్టెంబర్‌లో షెడ్యుల్‌ చేయబడి ఉంది. ఇది పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల దుబాయ్ కి మర్చాము. కాని ఐపిఎల్‌ కోసం ఆసియా కప్‌ షెడ్యుల్‌ను మార్చలని చూస్తే.. చూస్తూ ఊరుకోం . ఆసియా కప్‌ను మార్చలనే చర్చలు ప్రారంభమయినట్లు మాకు సమాచారం ఉంది. దీన్ని మేము సహించం. ఆసియాకప్‌ను నవంబర్‌-డిశంబర్‌ లో జరపడానికి ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అలా అయతే అది మాకు సాధ్యం కాదు అని వసీం ఖాన్‌ అన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/