ఆలయాల్లో అర్చకులకు ఆర్ధికసాయం అందిస్తున్నాం

ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

vellampalli srinivas
vellampalli srinivas

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక లోటు ఉన్నప్పటికి కూడా రాష్ట్రంలో ప్రతి పథకాన్ని కొనసాగిస్తున్నామని ఏపి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పేద అర్చకులకు ఆర్ధికసాయం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అర్చక సంక్షేమ నిధి నుంచి సుమారు 2,500 దేవ స్థానాలో తక్కువ జీతాలు అందుకుంటున్న అర్చకులకు రూ. 5000 చోప్పున అందించినట్లు మంత్రి తెలిపారు.అలాగే ముస్లిం మౌజర్‌లు, చర్చి పాస్టర్‌లకు కూడా ఆర్దిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా అన్నదానం చేసే పరిస్థీతి ఉన్న దేవాలయాల్లో దాదాపు యాబై వేల మందికి సరిపడా ఆహరాన్ని తయారు చేయించి అన్నదాన కార్యమ్రాలు నిర్వహిస్తున్నామన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/