మళ్లీ మోడి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది

Modi, Amit Shah
Modi, Amit Shah

న్యూఢిల్లీ: మళ్లీ ప్రధాని మోడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అమిత్‌ షా అన్నారు. ఈరోజు ఢిల్లీలో మోడి, అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సారి కూడా భారీ మెజారీటితో మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్‌ షా ఈ సందర్భంగా తెలిపారు. జన్‌ సంఘ కాలం నుండి కూడా బిజెపి ఓ వ్యవస్థగా పనిచేస్తుందన్నారు. మొద‌టి సారి కేంద్రంలో కాంగ్రెస్ లేని పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌న్నారు. 2014 లో దేశ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/