సుగంధ ద్రవ్యాల్లో కల్తీని కనిపెట్టే మార్గాలు

మహిళలకు వంటింటి చిట్కాలు

spices
spices

వంటింట్లో సుగంధ ద్రవ్యాలది అగ్రస్థానమే! ఇవి వంటకాలకు రుచి, సువాసనలను జోడిస్తాయి. కాబట్టి కొనేటప్పుడు కల్తీ లేని, నాణ్యమైన, తాజా సుగంధ ద్రవ్యాలనే ఎంచుకోవాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.!

దాల్చిన చెక్క!

ఎక్కువ శాతం మనం సరుకుల షాపులో కొనే సుగంధద్రవ్యం.. దాల్చినచెక్క రూపంలో ఉండే చైనీస్‌ కెసియా! నిజానికి సిసలైన దాల్చిన చెక్క.. సీలాన్‌ సినమన్‌.ఈ రెండింటికీ రూపం, సువాసనల్లో తేడా ఉంటుంది.

చైనీస్‌ కేసియా సువాసన తక్కువగా ఉండి, మందంగా చుట్లు చుట్టుకుని ఉంటుంది. సినమన్‌ పలుచగా, ఘాటుగా ఉంటుంది.

పొడి రూపంలో ఉన్న దాల్చనచెక్కను కొనేటప్పుడు దానిలో ఒక చుక్క అయెడిన్‌ వేసి చూడండి. అది నీలంగా మారితే అందులో చైనీస్‌ కెసియా కలిసిందని అర్థం.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలను బొప్పాయి గింజలతో కల్తీ చేస్తూ ఉంటారు. ఈ రెండింటి ఆకారం, పరిమాణం ఒకేలా ఉండడంతో కల్తీని కనిపెట్టడం కష్టంగా ఉంటుంది.

మిరియాలు కొనేటప్పుడు. నలిపి చూడాలి. ఒకవేళ అవి నకిలీవి కానట్లయితే పెద్ద ముక్కలుగా విరుగుతాయి. కొంత నూనె కూడా చేతికి అంటుకుంటుంది. ఒక వేళ నకిలీవి, పాతవి అయితే చిన్న ముక్కలుగా విరిగిపోతాయి.

మరాఠీ మొగ్గ

ఇది ఎరుపు గోధుమ రంగులో కలపలా ఎండిపోయి ఉండడంతో దీని తాజాదనాన్ని కనిపెట్టడం కొంత కష్టం అయితే ఇవి నకిలీవి కావని గ్రహించడానికి పువ్వులాంటి మరాఠీ మొగ్గ సెగ్మెంట్స్‌ (రెమ్మలు) లెక్కపెట్టాలి.

అవి ఎనిమిది ఉండి. వాటి లోపలి విత్తనం మెరుస్తూ ఉంటే. ఆ మరాఠీ మొగ్గ సిసలైనదే! అలకాకుండా మరాఠీ మొగ్గ ముదురు రంగులో ఉండి, తేలికగా విరిగిపోతూ ఉంటే పాతది, తక్కువ నాణ్యత కలిగినదిగా భావించాలి.

మిరపకారం :

కారాన్ని ఇటుక పొడి, పౌడరు లేదా సబ్బురాయిలతో కల్తీ చేస్తూ ఉంటారు. సిసలైన కారం పొడి నీళ్లలో కరగదు. కాబట్టి కొద్దిగా కారాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి చూడాలి. నీళ్లు రంగు మారితే
ఆ ఆకారం కల్తీదని అర్ధం.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/