జల వనరుల సంరక్షణే మానవ రక్షణ

నేడు ప్రపంచ జల దినోత్సవం

Water Security

ప్రజలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో ప్రజలంతా సంఘటితమై వ్యవసాయ క్షేత్రాల్లో కుంటలను తవ్వి భూగర్భ సంపదను పెంచడం అందరికీ ఆదర్శప్రాయం కావాలి.

కనుమరుగవ్ఞతున్న నాగానది సంరక్షణలో భాగంగా తమిళ ప్రజలు బావ్ఞలు తవ్వి వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా చేసి, భూగర్భ జలాలను పెంచి నాగానదిని పునర్జీవింపచేయడం ప్రశంసనీయం.

ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని నీటి అవశ్యకత గురించి వివరించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి.

ఇంకుడు గుంతలు, వాటర్‌ హార్వెస్టింగ్‌ వంటి పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు నీటి కొరతకు పరిష్కారమార్గాలు చూపాలి.

ప్రపంచదేశాలన్నీ తగు విధివిధానాలతో నీటి కొరతను నిర్మూలించాలి. వివక్షతకు తావ్ఞలేకుండా అందరికీ స్వచ్ఛమైన జలం అందించాలి.

ఆనాడే నిజమైన జలదినోత్సవం. మన విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం వలన ఏర్పడిందని, దాని ఫలితంగానే పంచభూతాలు ఆవిర్భవించాయని, నేల, నీరు, ఆకాశంలోని గ్రహరాశులు, నక్షత్రా లు ఈ మహా విస్ఫోటనం వలనే ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెబు తుంటారు.

బిగ్‌బ్యాంగ్‌ థియరీని దీనికొక ఉదాహరణగా పేర్కొంటారు. విశ్వం పుట్టుక ఎలా ఉన్నప్పటికీ ఈ సృష్టిలో సకల చరా చర జీవరాశుల మనుగడ మాత్రం నీటిపై ఆధారపడి ఉన్నది.

జలం లేనిదే జనం లేరు.ప్రాణికోటి మనుగడకు జలం అత్యంత అవశ్యకం. మానవ శరీరం సుమారు 70 శాతం నీటితో నిండి ఉంటుంది.

అలాంటి ప్రాధాన్యత గల ప్రాణాధారమైన నీరే కర వైతే మానవాళి మనుగడ లేనేలేదు. ఇప్పటికే ఈ సుందరమైన భూగ్రహం మానవ తప్పిదాలతో విధ్వంసమైపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.

వాతావరణ మార్పులతో, కాలుష్య కారకాలతో మానవ జీవనం అల్లకల్లోల సాగరంలా మారిపోయింది.

యుద్ధా లతో,అశాంతితో, ఆకలితో అధిక జనాభాతో, రోగాలతో, ప్రకృతి బీభత్సాలతో మానవ మనుగడ అత్యంత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రాణాధారమైన నీరు కూడా సకల దుర్గంధాలతో నిండిపోవడం, భవిష్యత్తులో నీరే కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించడం మానవ కల్పితమే.

ముమ్మాటికీ మానవ తప్పి దమే అని చెప్పక తప్పదు. 7.8 బిలియన్లు గల ప్రస్తుత ప్రపంచ జనాభా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెరిగిన జనాభాతోపాటు వారి అవసరాలకు సరిపడా వనరులను పెంచలేం.

జనాభా పెరుగుదల ఫలితంగా ప్రకృతిని విధ్వంసం చేయవలసి వస్తున్నది. సహజవనరులు తరిగాయి. నీటి అవసరాలు పెరిగాయి. నీటి శాతం తరిగింది.

2040 నాటికి నీటికోసం దారుణమైన పోరాటాలు జరిగే అవకాశం ఉంది. నీటి లభ్యత మృగ్యమై మరికొద్ది దశాబ్దాల్లో మానవ మనుగడ కడుదుర్లభంగా మారే అవకాశాలున్నాయి.

2050 నాటికి నీటి లభ్యత లేక స్నానాలు మాని, రసాయన లేపనాలతో జీవించ వలసి వస్తుందని మన క్షిపణి పితామహుడు అబ్దుల్‌ కలాం ఏనాడో హెచ్చరించారు.

మొత్తం జలసంపదలో ఒక వంతు మాత్రమే నేలపైన, మూడొంతులు సముద్రాల్లో నిండి ఉండడం వలన, సముద్ర జలం ఉప్పుతో కూడకుని వ్యర్థంగా మారిన దశలో మనకు లభ్యమయ్యే 2.5 శాతం నీటివనరులతోనే అవసరాలు తీర్చుకోవలసిన పరిస్థితి ఏర్ప డింది.

నీటి కొరతను, నీటి కాలు ష్యం, పారిశుద్ధ్యలోపాల వలన అనేక అంటువ్యాధులు ప్రబలుతు న్నాయి.

ఇప్పటికీ మన దేశంలో 60 మిలియన్ల మందికిపైగా ప్రజ లు సరైన నీరు లేక బాధపడుతు న్నారు. అందుబాటులో ఉన్న నీరు కలుషితాలతో నిండి వ్యాధులను వ్యాపింపచేయడం పుండుపై కారం చల్లడమే.

ఇప్పటికీ భారతదేశంలో 53 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు అందించలేక పంటల విస్తీర్ణం తగ్గి దేశ ఆర్థిక పరిస్థితి మందగించడం కూడా సహజమే.

ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలు రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవలసి వస్తుంది.

నాణ్యతాపరమైన తాగునీటి వినియోగంలో కూడా భారత్‌ వెనుకబడే ఉంది. అంతర్జాతీయ సంస్థలు జరిపిన సర్వే గణాంకాలను బట్టి నీటి నాణ్యతా ప్రమాణాలను దృష్ట్యా ప్రపంచంలోని 122 దేశాలలో 120వ స్థానం భారతదేశానిది.

కలుషితమైన నీటి వినియోగం వలన నీటిలో ఈ-కొలి బ్యాక్టీ రియా చేరి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఆహారం విషతుల్యంగా మారుతున్నది. కలరా, టైఫాయిడ్‌,

డయేరియా లాంటి రోగాలకు అపరిశుభ్రమైన నీటి వినియోగమే కారణం. భారతదేశంలో ప్రజలకు సరఫరా కాబడే నీటిలో 70శాతం ప్రమాదకరమైన కలుషితాలతో నిండి ఉన్నట్లు ఒక అంచనా.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రంచంలో 3.1 శాతం మరణాలకు నీటి నాణ్యతా లోపమే కారణమని పేర్కొనడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన అటల్‌ భూ జల్‌ యోజనపథకం ప్రకారం తగ్గిపోతున్న జలవన రులను పలు రకాలుగా వినియోగంలోకి తీసుకురావడానికే ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఐదేళ్లపాటు అమలు చేయబోయే ఈ పథకానికి అయ్యే వ్యయం రూ. ఆరువేల కోట్లు. నీటి నిల్వలు, భూగర్భజలాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి లభ్యతను మెరుగుపరచడం వంటిచర్యలు తీసుకుంటారు.

జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వంటి కారణాల వల్ల భూగర్భజలాలు తరిగిపోతున్నాయి.

వచ్చే ఐదేళ్ల ల్లో నల్లాలద్వారా మంచినీరు గ్రామీణ ప్రజలం దరికీ అందించాలన్న మహాసంకల్పం ప్రకటించి న కేంద్రప్రభుత్వం మొదట సమస్య తీవ్రతను సరిగ్గా మదింపుచేసి అవసరాలను అనుగుణం గా కేటాయింపులలో ముందడుగు వేయాలి.

గ్రామీణ భారతంలో 17కోట్ల 91లక్షల గృహాలు ఉంటే వాటిలో 18.3 శాతానికే నల్లా నీళ్లు అందుతున్నాయి.

16 రాష్ట్రాల్లోని 79 జిల్లాల్లో భూగర్భజలాలపై సాగించిన అధ్యయనం మరింతగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

లీటరు నీటిలో యురేనియం పరిమాణం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత ప్రమాణాల కంటే ఎన్నో రెట్లుఅధికంగా ఉంటుందని వెల్లడించింది.

పరిమితమైన వనరుల వలన ప్రపంచంలోని పేద దేశాలు భవిష్యత్తులో నీటి సమస్యతో సతమతమయ్యే సూచ నలు కానవస్తున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న దృష్ట్యా, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.

1992వ సంవత్సరంలో ఐక్య రాజ్యసమితి బ్రెజిల్‌లోని రియోడిజైనీరో లో నిర్వహించిన ఒక సదస్సులో నీటి అవశ్యకత గురించి ఒక తీర్మానం ఆమోదించింది.

1993 మార్చి 22వ తేదీన ప్రప్రథమంగా ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్‌ వాటర్‌ డే) జరిగింది.

అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీని ప్రపంచదేశాలన్నీ జల దినోత్స వంగా పాటిస్తున్నాయి.

2030 సంవత్సరం నాటికి అందరికీ పరిశుభ్రమైన నీరు అందించడమే ధ్యేయంగా ప్రారంభమైన ప్రపంచ జలదినోత్సవం ఈ ఏడాది ‘నీటి అవశ్యకత-వాతావరణ మార్పులు అనే థీమ్‌ను ఎంచుకుని మనముందుకు రాబోతున్నది.

దేశ ప్రజలను పీడిస్తున్న 21 శాతం రోగాలు కలుషిత జలాలవల్లనే సంక్రమిస్తున్నాయి.

వీటిని అరికట్టేందుకు ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని అందించడం, నీటి వినియోగాన్ని తగ్గించు కోవడం, వృధాగా కడలిలో కలుస్తున్న నీటిని ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా వినియోగంలోకి తీసుకురావడం మన ముందున్న తక్షణ కర్తవ్యం.

వ్యవసాయంలో శాస్త్రీయ దృక్పథం పెంచుకుని బిందుసేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించుకో వాలి. ప్రజలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు.

ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో ప్రజలంతా సంఘటితమై వ్యవ సాయ క్షేత్రాల్లో కుంటలను తవ్వి భూగర్భ సంపదను పెంచడం అందరికీ ఆదర్శప్రాయం కావాలి.

కనుమరుగవ్ఞతున్న నాగానది సంరక్షణలో భాగంగా తమిళ ప్రజలు బావ్ఞలు తవ్వి వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా చేసి, భూగర్భ జలాలను పెంచి నాగానదిని పునర్జీవింపచేయడం ప్రశంసనీయం.

ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని నీటి అవశ్యకత గురించి వివరించాలి.నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇంకుడు గుంతలు, వాటర్‌ హార్వెస్టింగ్‌ వంటి పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.

ప్రభుత్వాలు నీటికొరతకు పరిష్కారమార్గాలు చూపాలి. ప్రపంచదేశాలన్నీ తగు విధి విధానాలతో నీటి కొరతను నిర్మూలించాలి.

వివక్షతకు తావ్ఞలేకుండా అందరికీ స్వచ్ఛమైనజలం అందించాలి. ఆనాడే నిజమైన జలదినోత్సవం.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/