చెరువుల్లో నీటి స్వచ్ఛతకు నాణ్యతా పరీక్షలు

polluted ponds
polluted ponds

హైదరాబాద్‌: గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని 185 చెరువుల్లో నీటి స్వచ్ఛతను సరిచూసేందుకు నీటి నాణ్యతా పరీక్షలు కాలుష్య నియంత్రణ మండలి(పిసిబి) నిర్వహించనుంది. మే నెల మొదటివారంలో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించింది. పిసిబి సిబ్బంది శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించి నీటి నాణ్యతను లెక్కగడతారు. ఆ తర్వాత కాలుష్య తీవ్రతను బట్టి చర్యలు చేపడతారు.
గ్రేటర్‌ సహా సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాలోని చెరువులకు రసాయనాల ముప్పులో కొట్టుమిట్టాడుతున్నాయి. మరికొన్ని మున్సిపల్‌ వ్యర్థజలాల బారిన పడి కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. కొందరు అక్రమార్కులు చెరువులను డంపింగ్‌ యార్డులుగా మార్చేసుకోవడంతో నీరంతా కలుషితమవుతున్నది. దీంతో అనర్థాలకు దారితీస్తున్నది. జీవజాలం, ప్రాణికోటి మనుగడకు ముప్పువచ్చిపడింది. గతంలో పిసిబి నిర్వహించిన పరీక్షల్లో ఈనిటిలో అత్యధికంగా రసాయనాల ఘాడత, కాడ్మియం, ఆర్సినిక్‌, తదితర భారలోహాలు నీటిలో కలిసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆక్సిజన్‌ శాతం తగ్గుతున్నది.
పరీక్షలు నిర్వహించే చెరువులు: లంగర్‌ హౌజ్‌, లోటస్‌పాండ్‌, హుస్సేన్‌సాగర్‌, ఎల్లమ్మచెరువు, అంబర్‌ చెరువు, రామన్నకుంట, మేడికుంట, పటేల్‌ చెరువు, రంగదాముని కుంట, తిరుమలగిరి ట్యాంక్‌, పరికి చెరువు, నాగోలు చెరువు, రామంతాపూర్‌ చెరువు, నల్లచెరువు, దుర్గం చెరువుతో పాటు గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని 185 చెరువులు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/