ఈ 18న నగరంలో వాటర్‌ హార్వెస్టింగ్‌ డే

inkudu gunta
inkudu gunta

హైదరాబాద్‌: ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలనే సంకల్పంతో ఈ నెల 18న నగరంలో వాటర్‌ హార్వెస్టింగ్‌ డే నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిషోర్‌ వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో 12 వేల ఇంకుడు గుంతలున్నాయని, తిరిగి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఆ రోజు వాటిని శుభ్రపరిచి కావాల్సిన ఇసుక, ఇతర ముడి పదార్ధాలను అందజేస్తామన్నారు. రాబోయే వర్షాకాల ంనాటికి వాటిని సిద్ధం చేస్తామని తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయన్నారు. ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నగర వ్యాప్తంగా కొత్త ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/