ప్రకృతి దోషం కాదు, ఇది మనిషి ద్రోహమే!

నీరుగారుతున్న సాగు,తాగునీటి సంరక్షణ

Water conservation

తెలుగు రాష్ట్రాల చరిత్రను పరిశీలించినా కాకతీయులుకానీ, విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయుల కాలం నుంచీ సాగునీటికి.. ముఖ్యంగా చిన్ననీటి వనరులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు.

వాన నీటిని వృధాపోనీయకుండా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక క్రమపద్ధతిద్వారా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటుచేశారు.

వాగులు, వంకలకు అడ్డుకట్టవేసి నీటిని మళ్లించి చిన్నచిన్న కుంటలు ఏర్పాటుచేయడం, అవి నిండితే అలుగుద్వారా నీటిని మరో కుంటలోకి, ఇలా వరుసగా కుంటలు, చెరువులు ఏర్పాటుచేశారు.

వర్షాలవల్ల వస్తున్న నీటిని అంచనావేసి చిన్నా, పెద్దా చెరువులు నిర్మించారు.

వరంగల్‌ జిల్లాలోని రామప్ప, పాకాల, లక్కవరం, అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని కంభం, ఖమ్మంలోని పాలేరు తదితర చెరువ్ఞలను ఇందుకు ఉదహరించవచ్చు.

జీవనాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. అందుకే ‘ఎప్పుడు ఎడతెగకపారు ఏరు… ఉన్న చోటనే ఎంపిక చేసుకుని నివాసం ఉండమన్నారు సుమతీ శతకకారుడు.

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయినా సురక్షితమైన మంచినీరు నేటికీ దేశ ప్రజలందరికీ అందించలేకపో తున్నారు.

సాగునీటి సంగతి చెప్పాల్సినపనిలేదు. తెలుగు రాష్ట్రా లకు సంబంధించి కృష్ణా, గోదావరిలాంటి జీవనదులతోపాటు ఉప నదులు, చిన్నాచితకా నదులు దాదాపు నలభై వరకూ ఉన్నాయి.

ప్రాణపదమైన నీటిని కాపాడుకుని సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నాం.

ఇప్పటికీ వేలాది టిఎంఎసిల నీరు యేటా నిరుప యోగంగా సముద్రం పాలవ్ఞతున్నది. వర్షపునీరు కొన్నిప్రాంతాల్లో నగరాలను ముంపునకు గురిచేసి ప్రాణంమీదకు తెస్తున్నది.

ఆగస్టు నెలలో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయని చెప్పొచ్చు. ఉత్తరతెలంగాణాలోని వరంగల్‌, కరీంనగర్‌ లాంటి జిల్లాలపై వరుణదేవుడు తన ప్రతాపాన్ని చూపాడు.

ఈ వర్షాల్లో కోట్లాది రూపాయల విలువచేసే రహదారులుకూడా దెబ్బ తిన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయతో కొంతవరకు పూడికలు, మరమ్మతులు చేయించినా.. నిర్వహణ విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్పొచ్చు.

గతంలో ఈ చిన్ననీటి వనరులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల చరిత్రను పరిశీలించినా కాకతీయులుకానీ, విజయనగరా ధీశుడు శ్రీకృష్ణదేవరాయుల కాలం నుంచీ సాగునీటికి ముఖ్యంగా చిన్ననీటి వనరులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు.

వాననీటిని వృధాపోనీయకుండా భౌగోళిక పరిస్థితులను దృష్టిలోఉంచుకుని ఒక క్రమపద్ధతిద్వారా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వాగులు, వంకలకు అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించి చిన్న చిన్న కుంటలు ఏర్పాటు చేయడం, అవి నిండితే అలుగుద్వారా నీటిని మరో కుంటలోకి, ఇలా వరుసగా కుంటలు, చెరువులు ఏర్పాటు చేశారు.

వర్షాలవల్ల వస్తున్న నీటిని అంచనావేసి చిన్నా,పెద్దా చెరువులు నిర్మించారు.

వరంగల్‌ జిల్లాలోని రామప్ప, పాకాల, లక్కవరం, అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశంజిల్లాలోని కంభం, ఖమ్మంలోని పాలేరు తదితర చెరువులను ఇందుకు ఉదహరించ వచ్చు.

ఇలా రాజుల కాలంలోనూ, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్‌ కాలంలోనూ రాష్ట్రంలో వేలాది చిన్ననీటి వనరులను ఏర్పాటు చేశారు.

అవి తెగిపోయి గండ్లుపడినా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ, పూడికలు తీయిస్తూ అందులోనూ ఆ చెరువు కింద ఉన్న రైతులను భాగస్వాములను చేస్తూ నీటి వనరులను కాపాడుకునేవారు.

మొత్తంమీద నాటి ప్రభుత్వాలు సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయనేది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉన్న చిన్ననీటి వనరులు స్పష్టం చేస్తున్నాయి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొంతమేరకు ప్రాముఖ్యత ఇచ్చినా ముఖ్యంగా 1980 తర్వాత తగ్గిపోయిందనే చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదమూడు వేల వరకు చెరువులున్నట్లు రికార్డులు చెపుతున్నాయి.

ఇక పంచాయతీరాజ్‌ పరిధిలోని మరో లక్షాయాభై వేల వరకూ ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

వీటివల్ల సాగయ్యే భూమి తక్కువే అయి నా భూగర్భజలాలను రీఛార్జ్‌చేసే ఊట చెరువ్ఞలుగా ఎంతో ఉప యోగపడేవి. అవి రానురానూ తగ్గిపోయి రికార్డుల్లో ఉన్న చిన్న నీటి వనరులకు వాస్తవానికి ఎంతో తేడా కన్పిస్తున్నది.

ఇలా చిన్న నీటి వనరులు అదృశ్యం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమ నేది నిర్వివాదాంశం.

కుంటలు, చెరువులు, లోతట్టు లేని కాలం లో సాగుచేసేందుకు అనుమతివ్వడంతో వీటి క్షీణదశ ప్రారంభమైందని చెప్పొచ్చు.

జనవాసాలు విస్త రించేకొద్దీ కుంటల స్థానంలో ఫ్లాట్లు, నిర్మాణాలు ఆరంభమయ్యా యి.

వర్షాకాలంలో ఇవన్నీ నీటితో నిండిపోతున్నాయి. మొన్నటి వర్షాల్లో వరంగల్‌ నగరం అతలాకుతలమైంది. కాలనీలన్నీ జలమయమయ్యాయి.

ఇళ్లల్లోకి నీరు చేరింది. ప్రజలు మిద్దెలపైకెక్కి సహాయంకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇందుకు ప్రధాన కారణం నగరంలోని కుంటలు,వాటికి నీరు వెళ్లే నాలాలన్నీ (కాలువలు) ఆక్రమణకు గురయ్యాయి.

వరంగల్‌ నగర పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం దాదాపు 250 చిన్ననీటి వనరులుండాలి. అందులో యాభై ఐదు చెరువ్ఞలు మాయమయ్యా యని అధికారిక లెక్కలే చెపుతున్నాయి.

అంతకంటే ఎక్కువే అదృ శ్యమైపోయి ఉండవచ్చు.

ఈ ఆక్రమణలను తొలగిస్తామని, పదే పదే పాలక పెద్దలు ప్రకటిస్తున్నా.. కొంతమేరకు తొలగించినా ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అంతకు రెట్టింపుస్థాయిలో నాలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇది ఒక్క వరంగల్‌ నగరానికో, లేక తెలంగాణకో కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగాకూడా జరుగుతున్నది.

ఇంత పెద్దఎత్తున ఆక్రమణ జరుగుతున్నా, చెరువులకు చెరువులను ఆక్రమించుకుని ఫ్లాట్లుగా విభజించి అమ్ముకుంటున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ తెలిసిందే.

అయితే ప్రజలు కూడా అంతగా పట్టించుకోవడం లేదు.

వర్షపునీరు వచ్చి తమకు ఇబ్బం దులు కలిగినప్పుడు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారే తప్ప ఆక్రమణలు జరుగుతున్నప్పుడుకానీ, నిర్మాణాలు చేస్తున్న ప్పుడుకానీ మౌనసాక్షులుగా మిగిలిపోతున్నారు.

గతంలో ఆ పరిస్థితి ఉండేదికాదు. ఆ నీటి వనరులు కాపాడుకోవాల్సిన బాధ్య త తమ భుజస్కంధాలపై వేసుకునేవారు.

చెరువులను రక్షించుకు నేందుకు ఏమాత్రం వెనుకాడేవారుకాదు. ఇలాంటి సంఘటన ఒకటి నేను వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో ఉండగా 1976 ప్రాంతంలో జరిగింది. ఆరోజు గ్రామంలో పెద్ద వర్షం లేదు. మామూలు జల్లులు పడుతున్నాయి.

అర్థరాత్రి నా మిత్రుడు ఒకరు వచ్చి చెరువుతెగే ప్రమాదం ఉందని ఈ విషయం నీరడికాడు వచ్చి పట్వారీకి చెప్పాడని ఆయన హుటాహుటిన కొందరు రైతులను తీసుకుని చెరువ్ఞకట్టవద్దకు బయలుదేరినట్టు వివరించాడు.

అర్థరాత్రి చీకట్లో వెళ్లి ఏంచేస్తారని ప్రశ్నించాను. నా ప్రశ్నలకు జవాబులు చెప్పేస్థితిలో ఎవరూ లేరు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి సమాచారం అందించి వారిని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.

వారితోపాటు అర్థరాత్రి చెరువ్ఞ కట్టవద్దకు చేరుకున్నాను. అక్కడ ఒక యుద్ధవాతావరణం నెలకొన్నది.

ఏ పరిస్థితుల్లోనూ కట్ట తెగకుండా కాపాడుకోవలనే ఏకైక ధ్యేయంతో వారంతా ప్రకృతితో పోరాడుతున్నారు.

గడ్డిమోపు తెచ్చి అడ్డం వేసేవారు కొందరైతే, అక్కడ ఉన్న చెట్టును కొట్టి అడ్డం వేసి దానిపై మరికొందరు మట్టిపోస్తున్నారు. మరికొందరు మత్తడివైపు వెళ్లి రాళ్లు తొలగించి మట్టాన్ని తగ్గిస్తున్నారు.

ఇందులో చిన్నా పెద్దా అని లేదు. ఎవరికి తోచినవిధంగా వారు మట్టాన్ని తగ్గిం చేందుకు తమవంతు కృషిచేస్తున్నారు.

ఆ ప్రాంతంలో అది చాలా పెద్ద చెరువు అది తెగితే.. కోట్లాది రూపాయల విలువైన పంట లు పోవడమేకాకుండా కింది ప్రాంతంలో అనేక ప్రాంతాలు ముం పునకు గురయ్యే ప్రమాదం ఉంది.

వందలాది ఎకరాలు పంట భూములు కోతకు గురికావడం, ఇసుకమేట వేయడంతో బీడు భూములుగా మారిపోతాయి.

ఈ కారణాలే తెల్లవారేసరికి అంద రూ కలిసికట్టుగా ప్రకృతితో పోరాడటానికి పురికొల్పాయి. ఎట్టకే లకు పరిస్థితిని అధిగమించారు.

తెల్లవారేసరికి ప్రభుత్వాధికారులు కూడా వచ్చి ఇసుక బస్తాలువేసి కట్టకు మరింత భద్రత కల్పిం చారు. ఆ రాత్రి అక్కడికి వెళ్లకపోతే..

ఖచ్చితంగా చెరువ్ఞ దక్కే దికాదు. అదే చెరువుకట్టకు మొన్న గురువారం ఉదయం ప్రాం తంలో రంధ్రం ఏర్పడి క్రమేపీ గండిగా మారుతున్న విషయాన్ని గుర్తించారు.

ఎందుకో ఏమోకానీ గ్రామ ప్రజల్లో (ప్రస్తుతం మున్సిపాలిటీ) ఆనాటి ఐక్యత, అధికారుల్లో అంకితభావం ఇప్పుడు కన్పించలేదు. ప్రకృతి ముందు ఓడిపోయారు.

ఏమైతే నేమి రాత్రికల్లా చెరువుకు గండిపడింది. నీరు వెళ్లిపోయింది.

వందలాది ఎకరాల భూములు కోతలకుగురై మేటవేసి సాగు యోగ్యం కాకుండాపోయాయి.

ఇకపోతే ఆ తర్వాత తాపీగా గండికి మరమ్మతులు చేయడానికి వచ్చిన అధికారులు ఆ కట్టపైనే మద్యంతో విందులు చేసుకుంటున్నారంటే.. ఏమను కోవాలి?

చిన్న నీటి వనరుల విషయంలో పాలక పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కమిటీలతో, ప్రకటనలతో సరిపెట్టకుండా ఆచరణలో చూపించాలి.

తర, తమ బేధం లేకుండా ఎంతటి పెద్దవారికి చెందిన ఆక్రమణలనైనా నిర్దాక్షిణ్యం గా తొలగించాలి.

అలాగే చిన్ననీటి వనరుల పరిరక్షణలో ఆయా ఆయకట్టు పరిధిలోని రైతులను భాగస్వాములను చేయాలి.

ఆనాడు ప్రజల భాగస్వామ్యంతోనే ప్రకృతిపై విజయం సాధిస్తే, నేడు అది లోపించడంతో ప్రకృతిదే పైచేయి అయింది.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/