నీళ్ల సీసా శుభ్రత

వస్తువులు- జాగ్రత్తలు

Water bottle cleanliness
Water bottle cleanliness

ఆరోగ్యంపై జాగ్రత్త, సామాజిక అవగాహన కారణం ఏదయితేనేం.. ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్లినా వెంట ఒక నీళ్ల సీసా తీసుకెళుతున్నారు.

అంతవరకూ బాగానే ఉన్నా దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు తప్పవు అసలు ఎలాంటివి వాడాలి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుంటే మంచిది.

తక్కువ ధరకే దొరుకుతాయి, చూడటానికి బాగుంటాయి అనే కారణంతో చాలా మంది ప్లాస్టిక్‌ సీసాలను వాడుతుంటారు. కానీ వీటిని దీర్ఘకాలం వాడటం తీవ్ర అనారోగ్యాలకు దారితీయవచ్చు.

ప్లాస్టిక్‌ సీసాల్లో వేడినీటిని నింపడం అస్సలు మంచిది కాదు. వీలైతే గాజు, రాగి, స్టీల్‌ సీసాలను ఎంచుకోవాలి.

నీటిని ఎక్కువ రోజులు నిలువ ఉంచవద్దు. సీసాలో గోరువెచ్చటి నీళ్లను పోసి కాస్త లిక్విడ్‌ సోప్‌ వేసి బాగా కలపాలి.

కాసేపాగి బ్రష్‌తో శుభ్రం చేస్తే సరి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాటిళ్లలో వేడినీళ్లు పోసి, ఉప్పు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే దుర్వాసన మటుమాయం అవుతుంది.

అలాగే కొంచెం వెనిగర్‌ వేసి ఉంచాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/