క్యాప్‌ పెట్టుకున్న ఆ క్రికెటర్‌ ఎవరు?

చాహల్‌ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు

Yuzvendra Chahal
Yuzvendra Chahal

చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తనలోని అన్ని కళలను బయటపెడుతున్నాడు. తాజాగా టిక్‌టాక్‌లో డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియా తరుపున అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించిన చాహల్ మ్యాచ్ అనంతరం చాహల్‌ టీవీ పేరుతో ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. ఈ ఇంటర్య్వూలో చాహల్ వేసే ప్రశ్నలు అభిమానులను సైతం నవ్వులు పూయిస్తుంటాయి. చాహల్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాహల్ టిక్ టాక్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చాహల్‌‍తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ సహా మరో ఇద్దరు యువకులు ఇందులో డ్యాన్స్‌ చేశారు. అయితే, ఈ వీడియోలో చాహల్, శ్రేయాస్ అయ్యర్ వెనుక టోఫీ పెట్టుకుని డ్యాన్స్ వేసిన ఆటగాడు ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/