అమెరికాలో కాల్పుల కలకలం

ఒకరి మృతి..20 మందికి గాయలు

అమెరికాలో కాల్పుల కలకలం
Washington D.C. shooting

వాషింగ్టన్‌ :అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సరదాగా అంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకుంటున్న సమయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం బలిగొంది. మరో ఇరవై మంది గాయపడ్డారు. ఈ ఘటన వాషింగ్టన్‌ డీసీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిపార్టుమెంట్‌ చీఫ్‌ పీటర్‌ నీషం మాట్లాడుతూ.. వందలాది మంది ఒక్కచోట చేరి అవుట్‌డోర్‌ పార్టీ చేసుకున్నట్లు తెలిపారు. ఫుడ్‌ లాగిస్తూ.. మ్యూజిక్‌ వింటూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలోఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/