బాహుబలి సీక్వెల్‌లో నటించాలనుంది

david warner
david warner


కొన్నాళ్లు నిషేధానికి గురైన వార్నర్‌ ఐపిఎల్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌ నుంచే తన ప్రతాపం చూపిస్తూ బౌలర్లను ఉతికిపారేస్తున్నాడు వార్నర్‌. ఆయన తాజాగా ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌కు హాజరుకాగా ఓ విలేకరి వార్నర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. మీరు ఒకవేళ నటించాల్సి వస్తే ఏ తెలుగు సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతారు అని ఆ విలేకరి అడగగా వార్నర్‌ బాహుబలి అని ఠక్కున సమాధానం ఇచ్చారు. బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా మూడో పార్ట్‌ తెరకెక్కితే అందులో నటించేందుకు తాను సిద్ధం అని వార్నర్‌ అన్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/