ఫించ్‌ హాఫ్‌ సెంచరీ, వార్నర్‌ ఔట్‌

aaron finch
aaron finch, australian batsman

లండన్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత జోరు పెంచింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించడంతో లంకపై ఒత్తిడి పెరిగింది. ఈ ఓపెనింగ్‌ జోడిని ఎలాగైనా విడదీయాలని శ్రీలంక చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఆరంభం నుంచి తడబడుతున్న వార్నర్‌(26) బౌల్డ్‌ అయ్యాడు. ఫించ్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. 22 ఓవర్లు ముగిసేవరకు 97 ఒక వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్‌ ఫించ్‌(56), ఉస్మాన్‌ ఖ్వాజా(10)లు ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/