వార్నర్‌-బెయిర్‌ స్టో సరికొత్త రికార్డు…

david warner ,jonny bairstow
david warner ,jonny bairstow

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ అర్థ సెంచరీ సాధించాడు. 32బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సీజన్‌లో హాట్రిక్‌ అర్థ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లపై వార్నర్‌ అర్థ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఆర్‌సిబితో మ్యాచ్‌లో మరో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో 28బంతుల్లో 9ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో అర్థ సెంచరీ సాధించడంతో సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభం లభించినట్లయ్యింది. కాగా, అర్థశతకాన్ని సెంచెరీగా మలుచుకున్నాడు బెయిర్‌ స్టో. 52బంతుల్లో 12ఫోర్లు, 5 సిక్స్‌లతో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని చేసిన జోడీగా నిలిచారు. ఈ క్రమంలోనే 2017లో వార్నర్‌-ధావన్‌లు నమోదు చేసిన 138 పరుగుల భాగస్వామ్యం రికార్డు బద్ధలైంది. 185 పరుగుల ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు ఏసిన తర్వాత బెయిర్‌ స్టో (114) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఓవరాల్‌ ఐపిఎల్‌లో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం రికార్డు కూడా బ్రేక్‌ అయ్యింది. 2017లో గౌతం గంభీర్‌-క్రిస్‌ లిన్‌లు 184 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. కెకెఆర్‌ తరుపున నమోదు చేసిన ఈ ఓపెనింగ్‌ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికం. దీన్ని తాజాగా వార్నర్‌-బెయర్‌స్టోలు బద్దలు కొట్టారు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/