నిట్‌లో విద్యార్థి ఆత్మహత్య

Suicide
Suicide

వరంగల్‌: వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న కౌశిక్‌ పాండే (20) అనే విద్యార్థి వసతి గృహంలోని తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన కౌశిక్‌ తన అడ్మిషన్‌ రెన్యువల్‌ చేసుకునేందుకు ఇటీవలే తన తండ్రితో కలిసి నిట్‌కు వచ్చాడు.
ఈరోజు తన గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో నిట్‌లో విషాదం చోటుచేసుకుంది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/