లోక్ సభలో కరోనాపై గల్లా జయదేవ్ ఆందోళన
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఏ మేరకు పడబోతోంది

న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ (కొవిడ్-19) క్రమంగా ప్రపంచ దేశాలన్నింటీకి విస్తరిస్తుంది. ఈనేపథ్యలో కరోనా వైరస్‌పై టిడిపి ఎంపి గల్లా జయదేవ్ లోక్ సభలో ఈరోజు ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంత మేరకు పడబోతోందో మనమంతా అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు అంచనా వేస్తున్నారని అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/