వాల్తేర్ వీరయ్య నుండి మరో రొమాంటిక్ సాంగ్

వాల్తేర్ వీరయ్య మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండు వారాలు కూడా సమయం లేకపోవడం తో మేకర్స్ ప్రమోషన్ ను స్పీడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..తాజాగా మరో సాంగ్ రాబోతున్నట్లు చిరంజీవి లీక్ చేసారు. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ సాగే ఈ సాంగ్ కూడా ఫ్రాన్స్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సాంగ్ షూట్ తో వాల్తేరు వీరయ్య షూట్ కి గుమ్మడికాయ కొట్టినట్లు వెల్లడించాడు చిరు. త్వరలోనే ఈ పాట మరియు ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించిన వీడియో అండ్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.