వాల్తేరు వీరయ్య రన్ టైం ఎంత వచ్చిందంటే

మెగాస్టార్ చిరంజీవి – శృతి హాసన్ జంటగా మాస్ రాజా రవితేజ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ఎడిటింగ్ పనులను పూర్తి చేసారు మేకర్స్. ఈ చిత్రానికి ఫైనల్‌గా 2 గంటల 30 నిమిషాల నిడివితో రాబోతుందని తెలుస్తుంది. ఇది డీసెంట్ రన్ టైం అని చెప్పాలి.

ఇక ఇప్పటికే ఈ సినిమాలోని బాస్ సాంగ్ దుమ్ములేపగా..ఈరోజు రవితేజ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది. వాల్తేరు వీరయ్య లో విక్రమ్ సాగర్ ఏసీపీ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. రవితేజ తో గతంలో పవర్ వంటి పవర్ ఫుల్ సక్సెస్ ను ఇచ్చిన బాబీ మరోసారి రవితేజను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.