దుమ్ములేపుతున్న బాస్ పార్టీ సాంగ్

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య నుండి బాస్ సాంగ్ రావడమే కాదు యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా తనకు జోడీగా కేథరిన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బుధువారం సినిమాలోని పార్టీ సాంగ్ ను రిలీజ్ చేసి అంచనాలు పెంచారు మేకర్స్.

బాస్ నుంచి భారీ మాసీవ్ సాంగ్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్న అభిమానులని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ కోసం ‘బాస్ పార్టీ..’ అంటూ సాగే మాసీవ్ పార్టీ ఐటమ్ సాంగ్ కు స్వరాలు అందించడమే కాకుండా దేవిశ్రీప్రసాద్ సాహిత్యాన్ని అందించాడు. ఈ లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు.

ఈ పాటలో చిరుతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ..డ్యాన్సర్స్ పాల్గొనగా ఈ పాటని డ్యాన్స్ మాస్టర్ వీజే శేఖర్ చిత్రీకరించాడు. మెగాస్టార్ సిల్కు చొక్కా గల్ల లుంగీ ధరించి ఈ పాటలో మాసీవ్ స్టెప్పులతో అదగొట్టెస్తున్నాడు. ‘క్లబ్బుల్లోనా పార్టీ అంటే శర శరా మామూలే… హౌస్ పార్టీ అంటే కొత్తగా వుండదు ఏ మూలే… బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా వుండదులే.. నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ.. అంటూ సాగే ఈ పాటకు సంగీతం సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ అందించగా దేవితో కలిసి నకాష్ అజీజ్ హరి ప్రియ ఆలపించారు.