115 సెంటర్లలో 50 రోజుల పూర్తి చేసుకున్న వాల్తేర్ వీరయ్య

ఈ మధ్య కాలంలో వారం రోజుల పాటు సినిమా రన్ అవ్వడమే గగనమైన ఈరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ ఏకంగా 50 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. చిరంజీవి – బాబీ కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు బ్రహ్మ రధం పట్టారు. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ తో కలిసి సినిమా చూసిన సినిమాలే లేవు. ఒక్క వాల్తేర్ వీరయ్య తప్ప. చిన్న , పెద్ద ఇలా అంత సినిమాను ఎంజాయ్ చేసారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఈరోజు (మార్చి 03)తో 70 డైరెక్ట్ సెంటర్లలో, ఓవరాల్‌గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా వాల్తేర్ వీరయ్య కు మాత్రమే చెల్లింది.