అలరిస్తున్న దేవతల వాల్‌పేపర్లు

అలరిస్తున్న దేవతల వాల్‌పేపర్లు
Lord Shiva Photo wall paper

ఇంటిలోకి అడుగు పెట్టకముందే ఇంటి గేటు దగ్గర వినాయకుడి దర్శనంతో ప్రారంభంమై హాల్లోకి వెళ్లగానే అమ్మవారు సాక్షాత్కరిస్తే.. మనసంతా భక్తి భావంతో నిండిపోతుంది.. ఇల్లంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. అందుకేనేమో ఈకాలం భక్తులు ఫొటోఫ్రేంలకి బదులు దేవతల వాల్‌పేపర్‌లతో ఇళ్లకు కొత్తందాలు ఉట్టిపడేలా అలంకరిస్తున్నారు. ఈతరం అమ్మాయిలకు ఇల్లు సర్థుకునే సమయం అస్సలు దొరకడంలేదు. ఎవరి పనులలో వారు బిజీ. ఉరుకులు పరుగులు పెడుతూ మేలుకున్నా.. నిద్రపోతున్నా.. విశ్రాంతి తీసుకున్నా.. ఏదో ఆరాటం మనసులో ఏదో తెలియని దిగులు, మనశ్శాంతికోసం గుడికెళ్లి ఆదేవ్ఞడిని చూస్తేనే మనసుకు ఆనందం ఊరట అన్నీ లభిస్తాయి. కానీ అందుకు సమయం చిక్కడాయె.

అందుకేనేమో ఇప్పుడు చాలామంది తన ఇంటిలోనే నిలువెత్తు దైవాన్నే పెట్టి ఇంటినే దేవాలయంగా మార్చేస్తే అంతా ప్రశాంతతే అనుకున్నారో ఏమో అందులో భాగంగా ఆదేవ్ఞడికి పూజామండపాలూ మందిరాలూ కట్టించేస్తున్నారు. ఇప్పుడు ఆదేవ్ఞళ్లని హాల్లోనూ, లివింగ్‌ రూమ్‌ల్లోనూ అలంకరించేస్తున్నారు. హాలుని విడదీసే చెక్క పార్టిషన్‌ వాల్స్‌లోనే దేవతల బొమ్మల్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.
సాధారణంగా దేవ్ఞడిబొమ్మ అనగానే పూజామందిరాల్లో పెట్టుకునే విగ్రహమో, ఫొటోనో అనుకుంటారు. కానీ ఆదేవ్ఞడు బొమ్మలు నిలువెత్తు వాల్‌పేపర్ల రూపంలో అలంకారమై వెలుగొందుతున్నాయి. గృహాలంకరణాల్లో ప్రకృతి దృశ్యాలతో పాటు చెక్క నగీషీలూ, రాతిగోడలూ ఇలా వాటిల్లో లేనిదంటూ ఏమీలేదు. ఇప్పుడు ఆజాబితాలోకి దేవ్ఞడి బొమ్మల్నీ చేర్చారు. నిజంగానే మనముందు దేవ్ఞడి విగ్రహం ఉన్నట్లుగా అనిపించే త్రీడీ బొమ్మల్నీ చిత్రీకరిస్తున్నారు.

దేవ్ఞడిని ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఎవరికి నచ్చిన పద్థతిలో వాళ్లు అలంకరిస్తున్నారు. ఉదాహరణకు వినాయకుడినీ దుర్గామాతనీ తీసుకుంటే ఆయా నవరాత్రుల్లో రకరకాలుగా అలంకారాలు చేస్తుంటారు. ఆ అలంకరణలన్నీ కూడా వాల్‌పేపర్ల రూపంలో కనువిందుచేస్తున్నాయి . అలాగే, రాధాకృష్ణులూ దశావతా రాలూ శివపార్వతులూ.. ఇలా ఎందరో దేవీదేవతల రూపాలతోబాటు ఒకప్పుడు గుడిగోడలమీద చెక్కిన పౌరాణిక దృశ్యాలన్నీ కూడా గోడలమీద అందంగా కొలువ్ఞదీరుతున్నాయి. నిత్యం కొలిచే కొండంత దైవాన్ని భక్తితో ఇంట్లో గోడంతా అలంకరించుకుంటే ఆదేవ్ఞడే నట్టింట్లో తోడుగా ఉన్నట్లుండదూ..!

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/