విరిగిపడి కొండచరియలు ..10 మంది దుర్మరణం

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. ఫుర్నాస్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో సరస్సులో షికారు చేస్తూ సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా పర్వతంలోని కొంత భాగం విరిగి రెండు బోట్లపై పడింది. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ షాకింగ్ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురు కన్నుమూయడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. జలపాతంలో మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారి కోసం రెస్క్కూ టీమ్స్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/