ప్రమాదకర స్థితిలో ప్రపంచం

W.H.O చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన

W.H.O Chief Dr. Tedros Adhanam
W.H.O Chief Dr. Tedros Adhanam

ప్రస్తుత కరోనా తరుణంలో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ వైరస్‌ డెల్టా లాంటి వేరియంట్లు నిరంతరం మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలను నివారించడం, ఇళ్లను వెంటిలేషన్‌ చేయడానికి తగిన ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి కొవిడ్‌ టీకాలు వేసేలా చూడాలని ప్రపంచ నేతలను ఆయన కోరారు.

తక్కువ మంది ప్రజలకు టీకాలు వేసిన దేశాల్లో రోగుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికీ ఇంకా ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని..డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమైందని, దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కఠినమైన నిఘా, ప్రారంభంలో వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్‌ ప్రస్తుతం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/