హీరోగా వివి వినాయక్‌ కొత్త అవతారం..!

VV vinayak
VV vinayak

హైదరాబాద్‌: ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివి వినాయక్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/