టీఆర్ఎస్‌కు ఓటు వేయడం వృథా: ఉత్తమ్‌

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

హైదరాబాద్: నేడు గాంధీ భవన్ ప్రెస్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  పాల్గొన్నారు. మాట్లాడుతూ,  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జీఎస్టీ, నోట్లరద్దు విషయంలో బీజేపీకి టిఆర్ఎస్ బహిరంగంగానే మద్దతు తెలిపిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. విభజన బిల్లులోని హామీలను కేసీఆర్ సాధించలేకపోయారని ఆరోపించారు. అన్ని విషయాల్లో వైఫల్యం చెందిన టీఆర్ఎస్‌కు ఓటు వేయడం వృథా అన్నారు.
కేసీఆర్‌కు మళ్ళీ ఓటు అడిగే అర్హతలేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఎంపీలు ఇస్తే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ సాధిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని, జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి :