సుహాసినికి ఓటర్లే అపూర్వ స్వాగతం

nandamuri suhasini
nandamuri suhasini

హైదరాబాద్‌ ప్రభాతవార్త : ఎన్నికల ప్రచారంలో కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్ధి నందమూరి సుహాసినికి ఓటర్లే అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ నివాసానికి వెళ్లింది. ఓ గృహిణి సుహాసినికి సాదర స్వాగతం పలికారు. అంతేకాదు ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. మరో మహిళ సుహాసినికి తిలకం దిద్దారు. సుహాసినితో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమ్యారావు ప్రచారంలో పాల్గొన్నారు. సుహాసిని గెలుపు ఆకాంక్షింస్తూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూకట్‌పల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సుహాసినిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని కోరారు.