అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు
జీవన వైవిధ్యం

ఓటు వేయడం అంటే మనకేం కావాలో అడగడం మాత్రమే కాదు.. ఏం వద్దో కూడా చెప్పడం.
అసలు ఓటే వేయకపోతే? ఏమైనా చేసుకొమ్మని హక్కులన్నీ రాసివ్వడం! ఓటు హక్కుని కూడా!! మహిళలైతే అస్సలు.. మిస్సవద్దని అంటారు కేట్ రూబిన్స్.
తనైతే అంతరిక్షం నుంచే ఓటు వేయబోతున్నారు.
మహిళలే మార్పు కోసం ముందుంటారు. మహి ళలే మార్పు కోసం ముందుగా ఉద్యమిస్తారు. ఎందుకంటే మహిళలకే తమ స్థితిగతుల్ని మార్పుకోవలసిన అవసరాన్ని సమాజం ఎప్పు డూ కలిగిస్తూ ఉంటుంది.
‘సమాజం అని ఎక్కడో దూరాన్నుంచి చెప్పడం ఎందుకుగానీ, పురుషులు మారనందువల్లనే సమాజాన్ని మార్చే ప్రయత్నాలు చెప్పొ చ్చు.
ట్రంప్ ఉన్నారు. ఆయన్ని మార్చేయాలి. మనిషిని మార్చడం కాదు. అధ్యక్ష పదవి నుంచి మార్చేయాలి.
మహిళలం దరూ కలిస్తే ఆయన్ని మార్చడం సాధ్యం కావచ్చు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా అందరూ
కలిసి రాకపోతే! రాకపోయినా అదేమీ మార్పు కోసం ఏ ప్రయత్నమూ జరగకుండా పోయినట్లు కాదు.
ఎవరి వంతు ప్రయత్నాలతో వారే కదా ఇంతవరకు మహిళలు ఒకటవుతూ మార్పు సాధించుకుంటూ వచ్చారు. అమెరికన్ ఆస్ట్రోనాట్ కేట్ రూబిన్స్ తను ట్రంప్‌కి వ్యతిరేకమో అనుకూలమో చెప్పడం లేదు.
అయితే తప్పక ఆమె తన ఓటును నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికలో ప్రజాస్వామ్యంలో భాగస్వాములం అవడానికి ఓటు వేయడం అత్యవసరం అని ముఖ్యంగా మహిళలు తమ ఓటును మిస్ చేసుకోకూడదని కేట్ చెబుతున్నారు.
ఓటర్‌ల జాబితాలో పేరుండీ ఓటు వేయడాన్ని మహిళలు తరచు మిస్ చేసుకోడానికి కారణం రాజకీయాల్లో వాళ్లకు ఆసక్తి లేకపోవడం అనుకోకండి.
‘మిస్‌చేసుకోవడం అంటే ఇక్కడి అర్థం..భర్త చెప్పిన్లో, ఇంకొకరు చెప్పినట్లో ఫలానా అభ్యర్థికి ఓటేయడం. కేట్ రూబిన్స్‌కి ట్రంప్‌కి ఓటెయ్యాలని లేదనుకోండి.
ఆమె భర్త మైఖేల్ మేగ్నాని ఆమెను ట్రంప్‌కే ఓటెయ్యమని చెప్పాడనుకోండి.
అతడు చెప్పినట్లు కేట్ ట్రంప్‌కే ఓటేశారనుకోండి. అప్పుడు ఆమె తన ఓటును మిస్ అయినట్లు. ఓటు వేయకుండా ఉండకూడదు.
నచ్చిన వ్యక్తికి వేయకుండానూ ఉండకూ డదు అని కేట్ తరచు మహిళల్ని ప్రోతాహపరుస్తుంటారు. ఈ సారి కూడా ఎన్నికల సమయానికి ఆమె భూమి మీద ఉండబోవడం లేదు.
అక్టోబరు మధ్యలో అంతరిక్షంలోకి వెళ్తున్నారు. మళ్లీ తిరిగిరావడం వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే. అధ్యక్ష ఎన్నికలకు అంతరిక్షం నుంచే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటేస్తారు.
ఆమె ఒక్క ఓటు కౌంట్ కాకపోతే అధ్యక్ష అభ్యర్థు లకు వచ్చేది, పోయేది లేకపోవచ్చు. అయితే ఆమె ఒక్క ఓటూ అధ్యక్షుడు ట్రంప్, బైడనా అనే హోరాహోరీ పోటీలో ఒక సంఖ్యలో భాగంగానైతే ఉంటుంది.
ఆ భాగాన్నే.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడం అంటారు కేట్ రూబిన్స్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతరిక్షం నుంచే ఓటు వేశారు కేట్.
ఆ ఏడాది నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి వారం ముందే కేట్ భూమి మీదకు తిరిగి వచ్చేసినప్పటికీ ‘ఎర్లీ ఓటింగ్ సదుపాయంతో ముందే స్పేస్ నుంచి ఓటేశారు.

ప్రస్తుతం ఆ ఆస్ట్రోనాట్ తన రెండో అంతరిక్షయానానికి సన్నద్ధం అయేందుకు మాస్కోలోని స్టార్ సిటీలో అక్కడ మరో ఇద్దరు పురుష కాస్మోనాట్స్‌తో కలిసి శిక్షణ పొందుతున్నారు.
(ఆస్ట్రోనాట్‌అన్నా, కాస్మోనాట్ అన్నా ‘వ్యోమగామి అనే అర్థం. అమెరికా ఆస్ట్రోనాట్ అంటుంది.రష్యా కాస్మోనాట్ అంటుంది).
సూయెజ్ ఎం.ఎస్.-17 అనే వ్యోమనౌకలో రష్యాలోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ముగ్గురూ అంతరిక్ష కేంద్రంలోకి బయల్దేరుతారు. ముగ్గురిలో ఒకరు కమాండర్. ఇద్దరు ఫ్లయిట్ ఇంజనీర్‌లు.
కేట్ ఇంజనీర్ నెం.2 అంతరిక్ష కేంద్రంలోని (ఐ.ఎస్.ఎస్) ‘కోల్డ్ ఆటమ్ ల్యాబ్‌లో వ్యోమగాముల హృదయనాళాలపై అంతరిక్ష వాతావరణ పీడన ప్రభావాల మీద కేట్ ఆరు నెలల పాటు పరిశోధనలు జరుపుతారు.
ఆమె అక్కడ ఉన్నప్పుడే.. ఐఎస్‌ఎస్‌విరామం లేకుండా మనుషులతో సందడిగా ఉండి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భం వస్తుంది.
ఆమె అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్ ఎక్స్ రెండో విడత వ్యోమగాములకు స్వాగతం పలుకుతారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే భూమి మీద అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారాన్ని పై నుంచి వీక్షిస్తారు.
ఆమె ఓటు వేసిన అభ్యర్థి ఎన్నికయ్యారా, ఓటు వేయని అభ్యర్థి ఎన్నికయ్యారా అన్నది ఆమెకు తెలుస్తుంది. ఆమెకు మాత్రమే తెలుస్తుంది.
స్పేస్‌లో 60వ మహిళ :
కేట్ పూర్తి పేరు కేథ్లీన్ హ్యాలసీ కేట్ రూబిన్స్. నాసా వ్యోమగామి. కేట్ పుట్టింది కాలిఫోర్నియాలో. ఉంటున్నది టెక్సాస్‌లో.
ఏడో తరగతి చదువుతున్నప్పుడే స్పేస్ క్యాంప్‌కు వెళ్లడానికి అవసరమైన డబ్బుల కోసం ఇంటి చుట్టుపక్కల పనీపాటాచేసి, ఆ మేరకు సంపాదించు కున్నారు.
స్పేస్ క్యాంప్ అంటే ఏంలేదు.అలబామాలో నాసావాల్ల అంతరిక్ష మ్యూజియం ఉంటుంది.
అందులోని వింతలు-విశేషాలు చూసేందుకు వెళ్లే పిల్లల ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. కేట్ (41)తన ముప్పయవయేట నాసాలో ప్రవేశించారు.
2016లో స్పేస్‌లోకి అరవయ్యవ మహిళగా (ప్రపంచం మొత్తం మీద ) అడుగు పెట్టారు. కేట్ తర్వాత మరో ఐదుగురు మహిళలు ఐఎస్‌ఎస్‌ను చేరుకున్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/