‘ఆమెకు ఓట్ చేసి గెలిపించాలి’

రామ్ గోపాల్ వర్మ పోస్ట్!

Ariyana-RGV
Ariyana-RGV

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా బిగ్ బాస్ షో ను కూడా చూడడం మొదలు పెట్టారు అనిపిస్తుంది. ఇప్పుడు మన తెలుగులో ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ స్టేజ్ కు వస్తున్న ఈ షోలో మిగిలి ఉన్న కొద్ది మంది కంటెస్టెంట్స్ లో వర్మ ఓ కంటెస్టెంట్ కు ఓట్ వెయ్యమని చెప్పడమే కాకుండా.. ఆమెను ఈ సీజన్ విన్నర్ గా కూడా చెయ్యాలని పోస్ట్ చేసారు.

దీనితో నెటిజన్స్ వర్మ బిగ్ బాస్ చూడడం ఎప్పుడు మొదలు పెట్టాడు? ఈ షో కూడా చూస్తాడా అంటూ కామెంట్స్ వేస్తున్నారు.

ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు అరియాననే. రీసెంట్ గా మంచి గ్రాఫ్ ను తెచ్చుకున్న ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ కు అర్హురాలు అని ఆమెకు అందరు ఓట్ చేసి గెలిపించాలి అని తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/