ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Rajnath Singh, Mayawati
Rajnath Singh, Mayawati

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలో భాగంగా ఈరోజు ఐదో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌ క్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, ఆయన భార్య గాయత్రి రాథోడ్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వత్‌ సిన్హా, బీఎస్పీ అధినేత్రి మాయావతి  లక్నోలోని సిటీ మాంటెస్సరీ కాలేజీలో ఓటేశారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/