ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
ఈ నెల 29వ వరకు ఆలయంలోనే నిర్వహణ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఏప్రిల్ 29వ తేదీ వరకు ఆలయంలోనే ఏకాంతంగా జరుగనున్నాయి. ఆలయ ప్రధాన కంకణబట్టర్ రాజేష్ కుమార్ భట్టర్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం శ్రీరామనవమి, పోతన జయంతిని నిర్వహించారు. ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్లు వెంకటాచలపతి, వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/