ఒంటిమిట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

Vontimitta Brahmotsavam
Vontimitta Brahmotsavam


కడప: ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమితో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22న తేదీ పుష్పయాగంతో ముగుస్తాయి. ఒంటిమిట్ట రామాలయంలో కళ్యాణం పౌర్ణమి రోజున జరగడం ఆనవాయితీ. రోజుకో వాహన సేవలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆంధ్రా అయోధ్యగా ఏకశిలానగరంగా పిలిచే కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఏకశిలపై చెక్కిన సీతారాములు, లక్ష్మణ విగ్రహాలు ఉండడం ఓ ప్రత్యేకత. హనుమంతుడు లేని రామాలయం ఇదోక్కటే కావడం ఓ విశిష్టత.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/