వాలంటీర్లు బాధ్యతాయుతంగా పని చేయాలి

వాలంటీర్లు బాధ్యతాయుతంగా పని చేయాలి
AP Minister Peddireddy Rama chandra reddy

Vijayawada: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అర్హులై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్ససత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరును అందరూ అభినందిస్తున్నారని చెప్పారు.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/