గుంటూరు లో ఘోరం : బాలింతతో గ్రామ వలంటీరు అసభ్య ప్రవర్తన..

ఏపీలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుందని ఓ పక్క విమర్శలు వస్తున్న ..కామాంధులు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట మహిళల ఫై లైంగిక దాడులు , అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు. తాజాగా గుంటూర్ జిల్లాలో గ్రామ వలంటీరు బాలింత తో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలెత్తుకోకుండా చేసింది.

గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని పిల్లుట్లకు చెందిన వలంటీరు మల్ల గోపి ఈ నెల 22న గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. సదరు వ్యక్తి ఇంట్లో లేకపోవడం తో ఇంట్లో ఉన్న అతడి భార్యను ఫోన్ నంబరు అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన ఆమె ఇంట్లోంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి పొరుగింట్లోకి వెళ్లింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ మరుసటి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఆదివారం వలంటీరుపై కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ..బాలింతతో అసభ్యంగా ప్రవర్తించిన వలంటీరుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.