ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

ప్రజావాక్కు

విద్యుత్‌ పంపిణీతో ఇబ్బందులు: – సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

నల్గొండ జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్లిప్త నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా ప్రస్ఫుటమవ్ఞతుంటుంది. పలు ఇళ్లలో ఉన్న చెట్లకొమ్మలుగుండా, ఇళ్లమీదుగా విద్యుత్‌తీగలను ఇష్టారాజ్యం గా వేయడం వలన అవి ప్రమాదకరంగా మారాయి. ఇందు వలన తరచుగా ఇళ్లకు ఎర్త్‌కరెంట్‌ వచ్చి లోహపు వస్తువ్ఞలు ముట్టుకుంటే షాక్‌ కొడుతోంది. మరికొన్ని ప్రాంతాలలో పాత తీగలను మార్చి కొత్త వాటిని ఏర్పాటు చేసారు. అయితే ఈ పాతతీగలను తీయకుండా అలాగే వదిలేయడం వలన అవి తరచుగా వాహనదారులకు, వాహనాలకు అడ్డంపడి పలు ప్రమాదాలకు కారణమవ్ఞతున్నాయి. ఇక కాలం చెల్లిన ట్రాన్స్‌ ఫార్మలను మార్చకుండా మరమత్తులతో సరిపెడుతుండటం వలన తరచుగా వొల్టేజి సమస్యలతోపాటు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఇటీవల ఢిల్లీలో జరిగిన డిజిపిల సదస్సులో ప్రసంగిస్తూ ప్రధా ని నరేంద్రమోడీ వివిధ రాష్ట్రాల పోలీస్‌ విభాగాల మధ్య, కేంద్ర భద్రతా విభాగాలు,ఇంటెలిజెన్స్‌ వ్యవస్థల మధ్య మరిం తగా సమన్వయం, సమాచార వినిమయం పెంచవలసిన అవశ్యకత గురించి నొక్కిచెప్పడం హర్షణీయం. వివిధ స్వరూ పాలలోదేశంలోఉగ్రవాదులు,నక్సలైట్లబీభత్సకాండ సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సమన్వయం ఒక అనివార్యమైన మౌలిక భద్రతా సూత్రం. పెద్దనోట్ల రద్దు చేసాక నకిలీ కరెన్సీని పంపిణీ చేసే ఆర్తిక ఉగ్రవాదుల చర్యలకు తీవ్ర విఘాతం కలిగిన నేపథ్యంలో విద్రోహులు మరింత పేట్రేగిపోతున్నారన్న నిఘావర్గాల సమాచారం కారణంగా వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు మరింత మెరుగైన సమన్వయం సాధించాలి.
పేదరికాన్ని నిర్మూలించాలి: -ఎం.ఆంజనేయులు, హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో 35 శాతం, పట్టణాలలో 16 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయని 11 శాతం మంది 15-19 సంవత్సరాల మధ్య గర్భం దాల్చుతున్న కారణంగా వారికి నవజాత శిశువ్ఞలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతు న్నాయన్న కేంద్ర ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం అధ్య యన నివేదిక పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణం స్పందిం చాలి.రాష్ట్రంలో పేదరికం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. దించేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

భద్రతా ప్రమాణాలపై దృష్టి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో పాఠశాలలో భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించి మూడు నెలలలోగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం ముదా వహం. గత అయిదేళ్ల కాలంలో వివిధ పాఠశాలలో బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి పెంచడం, కిడ్నాపింగులు, హత్యలతో పాటు ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతున్నా ప్రభుత్వాలు మన వైఖరిని అనుసరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం సబబుగా ఉంది. గతం లో అనేక కమిటీలు ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలో భద్రతా ప్రమాణాలు క్షీణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసాయి. కాలం చెల్లిన బస్సులు, ఇష్టారాజ్యంగా ఆటోలు, జీపుల ద్వారా విద్యా ర్థులను చేరవేయడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా యి. భద్రతా ప్రమాణాల విషయంలో యాజమాన్యం, ప్రభు త్వం నిర్లక్ష్యవైఖరిని ఎత్తి చూపిస్తోంది.

ధరలను అదుపు చేయాలి: – ఆర్‌.రవిప్రకాశ్‌, నల్గొండ

పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడం వలన సామాన్యుల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ముఖ్యం గా గత నాలుగునెలలుగా వీటి ధరలు బాగాపెరిగినా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేక చేతుతెత్తేసింది. అంతర్జాతీయ మార్కె ట్‌లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోలియం ఉత్ప త్తుల ధరలను తగ్గించని చమురు కంపెనీలు కోట్లాది రూపా యల లాభాలను సంపాదించి, ధరలు పెరిగినప్పుడు మాత్రం వాటిని ప్రజలపై మోపుతున్నాయి.

ఉపాధ్యాయులను నియమించాలి:-ఎన్‌.రామకృష్ణ, నల్గొండ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువ్ఞలు సరిగా చెప్పరనే అపోహతో అనేకమంది తల్లిదండ్రులు తమపిల్లలను ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్హతలు, బోధనా సామర్థ్యంగల ఉపాధ్యాయలు ఎందరో ఉన్నారు.వారు బి.ఇడి, టెట్‌, డీయస్సీ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై బోధన వృత్తిలోకి ప్రవేశించిన సమర్థులు.వారికృషి కారణంగా ప్రభుత్వ పాఠ శాలలవిద్యార్థులు పదవ తరగతిలో మెరుగైన జిపిఏ సాధిస్తు న్నారు.కనుక ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులను చేర్పించడానికి ‘బడిబాట లాంటి ప్రచార కార్యక్రమాలను ఉపాధ్యాయులు చేపట్టాలి. విద్యాశాఖాధికారు లు పాఠశాలల్లో తగినట్లు ఉపాధ్యాయులను నియమించాలి.