ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

బాధ్యతారహితంగా పాలన: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు,ప.గోజిల్లా

విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్‌మెంట్‌,ఉపకారవేతనాల చెల్లిం పుల్లోనూ విపరీత జాప్యం చూస్తున్నాం. విద్యార్థులు వీటికై రోడ్డెక్కడం వలన వారి చదువ్ఞలకు భంగంకలుగుతుంది. ఇవే కాకుండా వసతిగృహాలలోఉండి చదువ్ఞకొంటున్న పేద విద్యా ర్థులకు కూడా ఖర్చుల నిమిత్తం ఇరవైవేల రూపాయలు ఇస్తా మని వాగ్దానంచేశారు.ఈక్రమంలో ఇంటర్‌విద్యార్థులకు మధ్యా హ్నభోజనం రద్దుచేసి, పేద విద్యార్థులకు మరింత ఆర్థికభారం పెంచారు.పాలకులు ఇటువంటి విషయాలలో బాధ్యతారహి తంగా వ్యవహరించడంతగదు.ఏదైనాఅడిగితే ఎన్నికల వాగ్దాన పత్రంలో లేదు అంటారు.మరి ఉన్నవాటి విషయంలో అమలు చేయకుండా ఏమి సమాధానం చెబుతారు?

తక్కువ చేసి చూడటం తగదు: -జి.వి.రత్నం, నెల్లూరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లక్షాపదివేల మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. ఎటిటి కేడర్‌ కన్నా తక్కువ కేడర్‌ లోఉన్నఇతర డిపార్ట్‌మెంట్‌వారు తక్కువ సర్వీస్‌తోనే పైస్థాయి అధికారులుగా ప్రమోషన్‌ పొందుతున్నారు.ఎటిటి వారు మాత్రం ఎటువంటి ఎదుగూబొదుగూ లేకుండా యస్‌.జి.టిలు గానే రిటైరవ్ఞతున్నారు.జూనియర్లుప్రమోషన్లు, పైస్థాయిపోస్టు లు పొందుతుంటే ఎటిటిల పరిస్థితి ఏమిటి?ఎటిటిలలో పిజి, ఎం.ఈడి. పిహెచ్‌.డి,ఎంఫిల్‌ చేసిన వారు ఉన్నప్పటికీ ప్రమో షన్‌ పొందడం లేదు. ఎన్నో చట్టసవరణలు జరుగుతున్నాయి. ఏక పద సవరణలతో జివోలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎటిటిలకు ప్రమోషన్లు కల్పించాలి.

దీనస్థితిలో గ్రంథాలయాలు : -ఇమ్మడి నాగేశ్‌, నారాయణ్‌పూర్‌, యాదాద్రిజిల్లా

నేటి భవిష్యత్తరాలకు అందించాల్సిన విజ్ఞాన భాండాగార మంత గ్రంథాలయాల్లోనే ఉంటుంది. అలాంటి గ్రంథాలయా లు నేడు అంధకారంలో మగ్గుతున్నాయి.సిబ్బంది కొరత మరో వైపుకుంగతీస్తున్నది.1992 నుండి ప్రభుత్వం గ్రంథాలయాల్లో నియామకాలు లేవంటే ఇంతకన్నా చిన్నచూపు ఇంకేముం టుంది. రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయంలో పుస్తకాలు వెతికేందుకు అవసరమైన వెలుతురులేదు.చాలీచాలని విద్యుదీపాలు పెట్టా రు. నిర్వహణ గాలికొదిలేశారు. పుస్తకాల ర్యాక్‌లో చేయిపెడితే దమ్మూధూళి వస్తుంది. గ్రంథాలయాల్లో సిబ్బందిని నియ మించాలి.పుస్తకాలు చెదలకు ఆహారమవ్ఞతున్నాయి. సంస్కృ తం పుస్తకాలు అందుబాటులో ఉంటడం లేవ్ఞ.ఇలా అయితే ఏటా గ్రంథాలయ వారోత్సవాలు ఏమని సందేశమిస్తాయి.

చట్టానికి, చట్టానికి జరిగిన సమరంలో..: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

పౌరసత్వ సవరణ చట్టంవిషయంలో దేశంలో బలమైన అభిప్రా యబేధాలున్నాయి.పరస్పర విరుద్ధ భావజాలంతో రాజకీయ పక్షాలు ఇరువైపులా మోహరించాయి. కేరళరాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో వివాదం మేలి మలుపుతిరిగింది.అదేబాటలో నడవాలని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి మరో 11 మంది ముఖ్యమంత్రుల్ని కోరుతున్నారు. కాగా కేరళ అసెంబ్లీ చర్యను తప్పుపడుతూ బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆ ముఖ్యమంత్రిపై రాజ్యసభలో సభాహక్కుల నోటీసు జారీకై విన్నపం చేశారు. ఈ చర్యలన్నీ సదరు అంశంలో తమతమ పంతాల్ని,వాదనల్ని తెలియచెప్పేవితప్ప అంతిమంగా పరిష్కా రం చూపేవికాదు. వాస్తవంగా పౌరసత్వ సంబంధిత విషయా లపై ఆధారిటీ పార్లమెంట్‌దే. పార్లమెంట్‌ మాత్రమే, పార్లమెం ట్‌ ద్వారా భారత ప్రభుత్వం మాత్రమే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలవ్ఞ.రాష్ట్రాలు కేంద్ర నిర్ణయానికి కట్టుబడాల్సిందే.

వినియోగదారుల హక్కులపై అవగాహన: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

నేటికీ చాలామంది వినియోగదారులకు తమ హక్కులపై సరైన అవగాహన లేకపోవడం వలన మోసపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు ఈ పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొం టున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం 1986 నాటి విని యోగదారుల సంరక్షణ చట్టానికి సవరణలు చేయ సంకల్పిం చడం ముదావహం. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిషన్ల ఏర్పాటు, అనైతికవ్యాపారాలను నిరోధించేందుకు రక్షణఅథారిటీల ఏర్పా టు, వినియోగదారులను తప్పుదోవపట్టించేలా ప్రకటనలు ఇచ్చే వారికి, వాటిలో పాలుపంచుకునే వారికి పది లక్షల జరిమానా, కల్తీలకు పాల్పడినట్లు రుజువైతే ఆరునెలల జైలుశిక్ష, వినియోగదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉత్పత్తులపై శాశ్వత నిషేధంవంటి సవరణలు చేయాలి.

పోస్టాఫీసులలో కంప్యూటీకరణ అవసరం:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

పోస్టాఫీసులనుఆధునీకరించాల్సిన అవసరంఉంది.చాలా పోస్టా ఫీసులలోకంప్యూటీకరణ జరగలేదు. ఈ కారణంగా పోస్టల్‌ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు అందడం లేదు. డిజి టల్‌ ఇండియాని చేస్తామని కేంద్రప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనబడటం లేదు. ప్రజలకు పోస్టల్‌ సేవలు దూరంకాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంది. \

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/