ప్రజావాక్కు

letters to the Editor: pragaa vakku
letters to the Editor: pragaa vakku

ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

వాడిపారేసే ప్లాస్టిక్‌ను రాబోయే మూడేళ్లలో నిర్మూలిస్తామని మహాత్మాగాంధీజీ150వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ప్లాస్టిక్‌ తయారుచేసే కర్మాగారాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ ప్లాస్టిక్‌ నిర్మూ లిస్తామనడం ప్రజలను, పర్యావరణ ప్రేమికులను పెడదారి పట్టించే విధంగా ఉంది. మంచినీరు, శీతలపానీయాలు, వస్త్ర, కిరాణా, మిఠాయి తదితర అన్ని దుకాణాదారులకు ప్లాస్టిక్‌ సంచులే కీలకమవ్ఞతున్నాయి. పూర్వం ప్రతీ ఒక్కరూ గుడ్డ సంచి వాడేవారు. ప్లాస్టిక్‌ అవతరించాక అవి మానేశారు. బహిరంగవిపణిలో ప్లాస్టిక్‌వస్తువ్ఞలు రాకుండా చేయడం ప్రభు త్వ విధానం కావాలి. కర్మాగారాలకు అనుమతులు రద్దు చేయ డం ఎవరైనా తయారు చేస్తే తగు విధంగా శిక్షించే చట్టం చేస్తే ప్లాస్టిక్‌ తయారీ జరగదు. ఇప్పటికైనా ప్లాస్టిక్‌ తయారీని అరి కడితేప్రజలు తనంత తానుగా వినియోగించరు. ప్లాస్టిక్‌ తయా రీని ఆపండి. భావితరాలను కాపాడండి.

జనావాసాల మధ్య మద్యం దుకాణాలా?:-గర్లిమెళ్ల భారతీదేవి, ఏలూరు,ప.గోజిల్ల్లా

రాష్ట్రంలో అంచెలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పినపాలకులు తామే అందుకుభిన్నంగా జనావాసాల మధ్య మద్యం దుకాణాలను ప్రారంభించడం సిగ్గుచేటు. ఇక్కడ కూడా అధికారపక్షం నేతలకు అద్దెరూపంలో పెద్దఎత్తున చెల్లిం పులకు తెర తీసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా ప్రజ లను వంచించడం దుర్మార్గం. మద్యం ధరల విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడు తామే భారీగా ధరలు పెంచ డం పాలకుల ద్వందనీతికి అద్దం పడుతుంది. ఇలాంటి మోస పూరిత విధానాలతో ప్రజల మెప్పు పొందలేరు.

నిర్వీర్యమవ్ఞతున్న స.హ చట్టం:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విపక్షాలు, మేధావ్ఞలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం చట్టసభలలో అతికీలకమైన సమాచారహక్కు సవరణ బిల్లును బలవంతంగా ఆమోదింపచేసుకోవడం అహేతుకం. సమాచార కమిషనర్లకు ప్రస్తుతం ఎన్నికల సంఘం కమిషనర్లతో సమానమైన హోదా ఉండగా, దానిని తగ్గిస్తూ సమాచార హక్కు చట్టానికి సవరణ లు చేయడం అంటే కమిషనర్ల స్వతంత్రను హరిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేయడమే అవ్ఞతుంది. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రులను సమాచారహక్కు కింద మినహా యింపు ఇవ్వడం సదరు చట్టంస్ఫూర్తికి విరుద్ధం.

బస్సుసౌకర్యం లేని ప్రాంతాలెన్నో..:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో సరైన రహదారి సౌకర్యం కల్పించినా ఆర్టీసీ బస్సులు ఏదో ఒక సాకుతో పలు పల్లెల వైపు బస్సులు నడప డం లేదు. గుంటూరు, తెనాలి, పొన్నూరుల నుండి గురజాల తదితరప్రాంతాలకు బస్సుసౌకర్యం లేకపోవడంవలన ప్రాణాం తకప్రయాణలే ప్రజలకు ఆధారమవ్ఞతున్నాయి.రిజిస్ట్రార్‌ కార్యా లయం గురజాలలో ఉన్నందున భూములు, గృహాలు, క్రయ, విక్రయాలకు పల్లెప్రాంతం ప్రజలు తరచుగా గురజాలకు వెళ్లవ లసి ఉంటుంది.ఆర్టీసీ సేవలు లేనందున అసురక్షితంగా ప్రయా ణం చేసే ఆటోలే ప్రజలకు దిక్కుగా మారింది. జిల్లాలో 50 శాతం పైగా గ్రామాలకు బస్సుసౌకర్యాలు నిలిపివేయబడడం వలన ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవ్ఞతున్నాయి.

వైద్యరంగానికి చికిత్స అవసరం: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యసేవల నాణ్యత, అందుబాటుపరంగా 154వస్థానంలో భారత్‌ నిలిచిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌ల కంటే భారతదేశం వెనుక బడిఉండడం దేశ ఆరోగ్యరంగంలో నెలకొన్నసంక్షోభానికి అద్దం పడుతోంది. వైద్యవిద్యలో సర్వశ్రేష్ట ప్రమాణాలు, ప్రజలందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామన్న భారతీయవైద్యమండలి దశాబ్దం నాటి హామీలు నీటి మీద రాతలుగా మిగిలిపోయా యి. ఈ నేపథ్యంలో దేశంలో వైద్యరంగానికి సత్వరం చికిత్స అందించేందుకు కేంద్రప్రభుత్వం వైద్యసేవల బిల్లును ప్రతిపా దించడం హర్షణీయం. ఎమ్‌.సి.ఇస్థానే జాతీయ వైద్య సంఘం ఏర్పాటుఇందులో తొలి అడుగుగా భావించవచ్చు. విద్యార్థులపై భారం తగ్గింపు వైద్యవిద్యలో ప్రమాణాల పెంపు, నిబంధనల సరళీకరణ, దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలో సీట్లు పెంపు, పెద్ద ఎత్తున వైద్యుల నియామకంవంటి చర్యలద్వారా వైద్యరంగాన్ని అభివృద్ధిరూపంలో నడిపిస్తామన్న కేంద్రం హామీ హర్షణీయం.

ప్రజల సమస్యలు పట్టించుకోని పాలకులెందుకు?: -అన్నపూర్ణ, విశాఖజిల్లా

నిరుద్యోగం నానాటికీపెరుగుతోంది.అయినా ప్రభుత్వాలు పట్టిం చుకునే స్థితిలో లేవ్ఞ. శుష్కవాగ్దానాలతో కాలయాపన చేస్తూ చిలకపలుకులుపలికి,ఐదుసంవత్సరాలు పదవిలో కొనసాగుతూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు. తమకు, తమ బంధు వ్ఞలకు అవసరమైన అన్ని పనులు సమకూర్చుకుంటున్నారు. కానీ ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/