ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

తగ్గిన కూలీల సంఖ్య:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టే కూలీల సంఖ్య గత రెండేళ్లలో 20 శాతం తగ్గిందన్న జాతీయ ఉపాధి కల్పనా సంఘం వార్షిక నివేదిక ఆందోళన కలిగిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మూడు లక్షల పైచిలుకు కూలీలు పేర్లు నమోదు చేయించుకున్నా ప్రస్తుతం 70లక్షల మంది మాత్రమే పనులకు హాజరవ్ఞతున్నారు.ఇంత తక్కువగా పనులకు హాజర వ్ఞతున్నా ఒక్కొక్క కుటుంబానికి సగటున వందరోజుల స్థానం లో 41రోజులుమాత్రమే పనికల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు సఫలమవ్ఞతున్నాయి.దినసరి వేతనంతక్కువగా, అదీ ఆలస్యం గా అందడం, పథకాల అమలులో భారీ అవినీతి చోటు చేసు కోవడం ప్రధాన కారణాలుగా సదరు నివేదిక పేర్కొంటోంది. ఉపాధి హామీ వేతనాన్ని లెక్కగట్టెందుకు వ్యవసాయ కార్మికుల వినియోగ ధరలసూచీని కాకుండా గ్రామీణ ప్రజల వినియోగ ధరలో సూచిని పరిగణనలోకి తీసుకోవాలన్న సదరు నివేదిక సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అమలు చేయాలి.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై శీతకన్నువేయడం విచార కరం. యువతను నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు. ఏటా లక్షల్లో గ్రాడ్యుయేట్లు కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల నుంచి బయటకువస్తున్నారు. ప్రభుత్వరంగంలో ఖాళీలు పెరిగిపోతున్నాయి. పైగా ఆర్టీసీలో వయోపరిమితి పెంచ డంవల్ల ఇంకా నిరుద్యోగ సమస్యపెరిగిపోతుంది. ఇలాంటి చర్యలు మంచివికావు. యువతను నిర్వీర్యం చేయకుండా ఖాళీల భర్తీపై దృష్టిపెట్టాలి.

స్నేహపూర్వక సంబంధాలు:-ఎ.సురేష్‌, ఆలువాల, హైదరాబాద్‌

బంగ్లాదేశ్‌తో స్నేహపూర్వక వాతావరణం సృష్టించేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ తనవంతు కృషి చేస్తున్నారు. ఫలితంగా ఇటీవల బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి దేశపర్యటన సం దర్భంగాపలు వాణిజ్యఒప్పందాలపై సంతకాలు జరగడం శుభ పరిణామం.దక్షిణాసియాలో పెరుగుతున్న చైనా ప్రాబ ల్యాన్ని అడ్డుకునేందుకు భారత్‌బంగ్లాదేశ్‌ మద్దతు తప్పనిసరి అవ్ఞ తోంది. భారత్‌, బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు గట్టిపరచుకు నేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరొకవైపు చైనా బంగ్లాదేశ్‌ కు ఉదారంగా రుణాలు ఇవ్వడం, సత్సంబంధాలను మెరుగు పరుచు కుంటూ భారత్‌కు గట్టి సవాల్‌ విసురుతోంది. కాబట్టి బంగ్లాదేశ్‌తో భారత్‌ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

విహారయాత్రలు తప్పనిసరి చేయాలి:-సి.ప్రతాప్‌,శ్రీకాకుళం

ఒకప్పుడు విద్యాసంస్థలలో ఉపాధ్యాయులు క్రమంతప్పకుండా విహారయాత్రలు నిర్వహించేవారు. చారిత్రక ప్రదేశాలు, దేవాల యాలు, ప్రాచీనకట్టడాలు,భౌగోళిక వైరుద్ధ్యం వ్ఞన్న ప్రదేశాలకు విద్యార్థులను తీసుకువెళ్లి వాటి ప్రాముఖ్యత, చరిత్ర వివరించే వారు.పరిశ్రమలకు తీసుకువెళ్లి అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించేవారు.అందువలన విద్యార్థులకు పుస్తకజ్ఞానంతోపాటు ప్రత్యక్షజ్ఞానం కూడా అలవడేది. అయితే కాలక్రమేణా విద్యా సంస్థలలో ర్యాంకులు, మార్కులు, పర్సెంటేజీలకు ప్రాధాన్యత పెరిగి విహారయాత్రలు సమయం వృధా అనే భావనతో వాటికి తిలోదకాలిచ్చేశారు.ఇప్పటికేవిద్యార్థులకు భారతదేశ సంస్కృతి, చరిత్ర, జీవన విధానం వంటి వాటిపై సరైన అవగాహన లేదు. ఇంటికి, విద్యాసంస్థలకు మాత్రమే పరిమితమైపోతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డిగ్రీస్థాయి వరకు విద్యాసంస్థలలో విహారయాత్రలు తప్పనిసరి చేయాలి.

ప్రజావ్యతిరేక నిర్ణయాలు: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని విధంగా నిర్ణయం తీసుకు న్నానంటూ జగన్‌ ప్రకటించారు. అయితే గత ఐదు వారాలుగా రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు, అఖిలపక్ష కమిటీ నేతలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. ఆ ప్రాంత ప్రజలు బలవన్మరణాలు,ఆందోళనలతో సుమారు నలభై మంది బలిదానాలు చేసుకున్నా,మహిళలను,వృద్ధులనూ బాధించడం, చలో అసెంబ్లీకి వెళ్తున్న నాయకులను ఇంటి వద్ద నిర్బంధించ డం వంటివిచూస్తుంటే మనం ప్రజాస్వామ్యదేశంలోనే ఉన్నా మా? అనే అనుమానం కలుగుతుంది. రాజధాని ఆందోళనలకు వెంటనే తెరదించాలి.

నాయకులు సరే మరి ప్రజలు!:-మిథునం, హైదరాబాద్‌

బ్లాక్‌మని ఉన్నదంటు ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకుని వారిని కొన్ని నెలలపాటు జైలులో ఉంచు తూ వారి వద్ద బ్లాక్‌మని ఉందో లేదో తెలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దర్యాప్తు సంస్థల ప్రయత్నా లన్నీ చివరికి వృధా అవ్ఞతున్నాయి. ఏమీ తెలుసుకోలేక వారి నేమి చేయలేక వదిలేస్తున్నారు.అదుపు లేకుండా ఉన్న ధరలతో అంతకంతకు పెరిగిపోతున్న నిరద్యోగంతో సామాన్య ప్రజల వద్దఅసలుమనీఅనేదేలేకుండాపోతోంది.దీనిని పట్టించుకోకుండా అనవసర విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు పాలకులు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/