ప్రజావాక్కు

People
voice of the people

కాలుష్యవాహనాలను నిరోధించాలి: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాల జిల్లా

రోడ్లపై విషవాయువులను వెలిగక్కే వాహనాలను నిరోధించా లని రవాణాశాఖ తలపెట్టిన వ్యూహం సక్రమంగా అమలు కావడం లేదు. బైకులను మాత్రమే ఆపి, అన్ని రకాలుగా పరీ క్షిస్తున్నారు.ఇతర వాహనాలకు కాలుష్యసంబంధమైన పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయడంలో విఫలమవ్ఞతున్నారు. కాలం చెల్లిన వాహనాలు కాలుష్యాన్ని కక్కుతూ రణగొణధ్వనులతో దూసుకుపోతుంటే ప్రజలకు ఊపిరి ఆడటం లేదు. ఇసుక, ఇటుక, కంకర తదితరాలను రవాణా చేసే లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు వాతావరణాన్ని ఎక్కువగా కలుషితం చేస్తున్నాయి. పెట్రోలు, డీజిలులో కల్తీ చేస్తున్నందువల్ల అన్నిరకాల వాహనా లలోనూ కాలుష్యంస్థాయి పెరిగింది. ఇంధనం కల్తీ నిరోధించి, వాహనాలకు పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా ప్రజలకు పరిశుభ్రమైన గాలిని అందించాలి.

ఆత్మహత్యలు ఆపండి: -గరిమెళ్లరామకృష్ణ, ఏలూరు, ప.గో.జిల్లా

రాష్ట్రంలోఇప్పటివరకు రైతులఆత్మహత్యలే వింటున్నాం. ఇప్పు డు భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం.అలాగే డెంగ్యూ, తదితర విషజ్వరాల బారినపడి భార్య మృతిచెందితే మానసిక ఒత్తిడితో నాలుగేళ్ల కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య చేసుకోవడం హృదయవిదా రకంగాఉంది. ఇలాంటి వార్తలు నిత్యం పత్రికలలో వస్తున్నా యి.మరి పాలకులుఇటువంటి ఆత్మహత్యలకు బాధ్యత వహిం చాలి. ఇసుక కొరత గత నాలుగు నెలలుగా ఉన్నా పాలకులు సరైన చర్యలు తీసుకోలేదు. అలాగే పారిశుద్ధ్యం లోపించి దోమకాటుతో ప్రజలు విషజ్వరాలబారిన పడుతున్నారు. మరి పాలకులు నిద్రపోతున్నారా? నిద్రపోతున్నట్లు నటిస్తున్నారా?

పిల్లలు ప్రచార సాధనాలా?: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థీ ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. కానీ ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలు ఒక్కొ క్కరు ఒక్కొక్క రంగుబట్టలు యూనిఫారంగా నిర్ణయించారు. వారంలో రెండు రోజులు ఆ రంగు, రెండు రోజులు ఈ రంగు మధ్య మధ్యలో ఈ బట్టలు అంటూ తికమకకి గురి చేస్తున్నా రు. తల్లిదండ్రుల చేత అనేక డబ్బులు ఖర్చు చేయించడమేకాక కొన్ని విద్యాసంస్థలు వారిసంస్థల పేర్లు ముద్రించిన టీ షర్టుల విక్రయాలు చేసి పిల్లలను నిర్దేశిత రోజుల్లో వాటిని ధరింప చేస్తున్నారు. పాఠశాల ప్రచారానికి పిల్లలచే అనేక రకాల బట్టలు ధరింపచేయడం జరుగుతుందని అర్థం అవ్ఞతుంది.

ఎక్కడి సమస్యలు అక్కడే: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీల వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్థికవేత్తలు,నిపుణులు ఆనాడే చెప్పారు. ఇవి తొందరపాటు నిర్ణయాలని కూడా అన్నారు. ఇప్పుడు వారు చెప్పినట్టే అక్షరాలా జరుగుతోంది. ఆర్థిక మాంద్యం దేశాన్ని ఒక కుదుపుకుదిపేస్తోంది. ఆర్థికవ్యవస్థ కుంటుపడటంతో చాలా పరి శ్రమలు మూతపడిపోయాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో కొన్నిసంస్థలు ఉద్యోగులను తొలగించాయి. వీటికితోడు దేశంలో పేదరికం ఆకలిచావ్ఞలు వంటివి బాగా పెరిగిపోయి బడుగుజీవి బతుకు దుర్భ´రంగా మారిపోయింది. అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్‌ ముందుండటం మరో దౌర్భాగ్యం. ఈ సమ స్యలేవీ పాలకుల కళ్లకు కనబడటం లేదు. తమ పాలన అద్భు తంగాఉందని సంబరపడుతున్నారు.గతంలో ఎవరూ చేయలేని పనులను తాము చేస్తున్నామని, సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ప్రధాన సమస్యలు ఏవీ పరిష్కారం కావడం లేదు.

స్వచ్ఛతవైపు అడుగులు వేయాలి:-షేక్‌అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రతి మండల కేంద్రంలో సామూహిక మరుగుదొడ్లు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ వివిధ కార్యకలాపాలపై మండల కేంద్రానికి వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ముఖ్యంగా మహిళలు కూడా ఉంటారు. వారు చాలాఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సామూహిక మరు గుదొడ్లు నిర్మాణం తప్పకుండా జరగాలి. కేంద్రం స్వచ్ఛతవైపు అడుగులు వేసినట్లు అవ్ఞతుంది. ప్రతి మండల కేంద్రంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మాణం జరగాలి.

చట్టాలు పటిష్టంగా అమలు జరగాలి: -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

దేశం చిన్నదా?పెద్దదా?అక్కడ ఎటువంటిపాలన సాగుతోంది? అక్కడ ఏ మతం వర్ధిల్లుతోంది? ఇలా వ్యర్థమైన ప్రశ్నలతో ఆలోచనలు చేయకుండా అక్కడ చట్టం, న్యాయం పరిపాలన ఏవిధంగా సాగుతున్నాయి అన్నది తెలుసుకోవాల్సి ఉంది. చట్టాలు పటిష్టంగా ఉన్ననాడు నేరాలకు తగిన శిక్షలు అమలు జరుగుతున్ననాడు ఆ దేశంలో అరాచకాలు, ఆకృత్యాలు అణగి ఉంటాయి. అదే నేరాలకు శిక్షల్లో జాప్యం అవ్ఞతున్నా, అమలు జరగకపోయినా నేరాలు ప్రబలిపోతాయి. నేరస్తులు విజృంభి స్తారు. అంటే అటువంటి వాటికి తావ్ఞలేకుండా ఉండాలంటే అక్కడ చట్టాలు పటిష్టంగా, బలంగా పనిచేయాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com