ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

ముంపునకు గురవుతున్న గ్రామాలు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఇచ్చాపురం మండ లంలోని ఇరవైగ్రామాల ముంపు సమస్యను పరిష్కరించలేకపో తున్నాయి. జగన్నాథపురం, అయ్యవారి పేట వంటి గ్రామాలు కొద్దిపాటివర్షాలకే ముంపు సమస్యను తరచుగా ఎదుర్కొంటు న్నాయి. ఇంట్లో నిల్వ ఉంచిన ధాన్యం, బియ్యం, ఇతర నిత్యా వసరాలు,విక్రయించేందుకు దుకాణాదారులు తెచ్చుకున్న సరు కులు,విలువైన పత్రాలు, సామానులు ఇలా అన్ని నీటి పాలవ్ఞ తున్నాయి. కొన్నిసార్లు భారీ వర్షాలకు అర్థరాత్రి వరద నీరు చొచ్చుకువస్తే చీకటిలోనే ఇళ్లపైకిఎక్కి ప్రాణాలు కాపాడుకోవ లసివస్తోంది. ఇప్పుడు లభ్యమవ్ఞతున్న సాటిలైట్‌ కమ్యూనికే షన్‌ వ్యవస్థ ఆధారంగా వరదముప్పు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలనుఅప్రమత్తం చేయడంతోపాటు రక్షణగోడలు నిర్మాణం, లోతట్టుప్రాంతాలఅభివృద్ధివంటిచర్యలనుప్రభుత్వం చేపట్టాలి.

మత్తుపదార్థాలను నిషేధించాలి: -డి.చాంద్‌బాష, కర్నూలు

మార్కెట్‌లో లభ్యమవ్ఞతున్న మత్తు పదార్థాలను ప్రభుత్వం వెంటనే నిషేధించాలి.ఎందరో ప్రజలు మత్తుపదార్థాలకు బాని సలుగా మారి తమ ఆరోగ్యాలను, జీవితాలను నాశనం చేసు కుంటున్నారు.మరెందరో ఆస్పత్రుల పాలవ్ఞతున్నారు. ము ఖ్యంగా సారా,గుడుంబా, గుట్కా, పాన్‌మసాలా, డ్రగ్స్‌, ఈ- సిగరెట్‌లు వంటి వాటిని నిషేధించి, అక్రమంగా కూడా మార్కె ట్లో అమ్మకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

సరైన సమయంలో సరైన అవకాశం:-జి.వి.సాయికుమార్‌, పెనుగొలను, ఆంధ్రప్రదేశ్‌

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ సమస్య ఇప్పుడు అంతర్జాతీయ మీడి యాకు వస్తువ్ఞగా మారింది. జమ్మూకాశ్మీర్‌ స్వయం ప్రతి పత్తి రద్దుని స్థానిక అంశంగా మనదేశం వారిస్తుంటే చిర కాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ మాత్రం అంతర్జాతీయంగా మన దేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు విఫలప్రయత్నాలు చేస్తుం ది. పాకిస్థాన్‌తోపాటు చైనా కూడా పెదవి విరుస్తూనే ఉంది. జరగనున్న అనధికార సమావేశంలో ప్రధాని మోడీ జింపింగ్‌కు ఆర్టికల్‌ 370 రద్దుపై వివరణ ద్వారా అంత ర్జాతీయ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడానికి మార్గం సుగమం అవుతుంది. తద్వారా మానవ హక్కుల ఉల్లంఘనపై భారత్‌వైపు వేలు చూపించే పరిస్థితులు నివారించవచ్చు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఆంధ్రప్రదేశ్‌లో 11విశ్వవిద్యాలయాలలో2800 దాకా అధ్యాపక పోస్టులుఖాళీగా ఉన్నాయి.2017 సంవత్సరంలో తొలివిడతలో వెయ్యి పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జి.వో వచ్చినా మార్గదర్శకాలు జారీ చేయడంలో విద్యాశాఖ జాప్యం కారణంగా ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దాదాపుగా ఐదు విశ్వవిద్యాలయాలలో శాశ్వత ఉపకులపతులు లేరు. అర్హు లైన ఆచార్యులు లేనందున విద్యాబోధనలో నాణ్యత దెబ్బతిం టోంది.పిహెచ్‌డి విద్యార్థుల సంఖ్య తగ్గి పరిశోధనలు కుంటుప డుతున్నాయి. అనేక విద్యాలయాలకు న్యాక్‌ గ్రేడ్‌పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం పొరుగురాష్ట్రాలకు వలసవెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.

నిబంధనలు పాటించని పాఠశాలలు:-సంతోష్‌కుమార్‌, హైదరాబాద్‌

విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో విద్యార్థుల నుంచి ఏదైతే ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిలో 50 శాతం ఫీజు లను ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సిఉంటుంది. కానీ యాజ మాన్యాలు ఆ నిబంధనను పాటించడం లేదు. చాలీచాలని జీతం అనగా మూడువేల నుంచి మహా అంటే 15వేల వరకు ఇస్తున్నారు.15శాతం ఉద్యోగుల జీవితబీమా, గ్రాట్యూటీ, ఈపి ఎఫ్‌, ఈఎస్‌ఐ వాటికి కేటాయించాలని తెలియచేసింది. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా ఇది అమలు కావడం లేదు. దీని ద్వారా ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారు. 15 శాతం పాఠ శాల డెవలప్‌మెంట్‌ కోసం అనగా లాబరేటరీ, లైబ్రరీ, స్టేషనరీ, నూతన ఆవిష్కరణలకు అని తెలియచేసింది. కానీ ఏ ఒక్క పాఠశాలల్లో కూడా లైబ్రరీ, లాబరేటరీ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జిల్లాస్థాయి విద్యాశాఖ ఏ విధంగా అనుమతులు ఇస్తున్నాయో అర్థంకావడం లేదు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

నూతనంగా గత మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు అయిన జిల్లాకేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిం చాలి.ముఖ్యంగా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించాలి. జిల్లా కేంద్రంలోప్రజలు ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాలకు నూ తనంగా సిటీ బస్సులను నడపాలి. అలాగే జిల్లా కేంద్రం లో ఉండే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం నిర్మించాలి. జిల్లా కేంద్రాలలో పాక్షికంగా దెబ్బతిన్న రోడ్ల ను మరమ్మతులు చేయాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/