ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

సహచట్టంలో సవరణలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

సహ చట్టంలో సవరణలను రూపొందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్ల పదవీ కాలం, హోదాలకు కోత పెట్టేందుకు నడుం కట్టడం మంచి పరిణామం కాదు. చట్టబద్ధ వ్యవస్థలకు రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సంస్థలతో సమాన స్థాయి ఉండకూడదన్న ప్రభుత్వ వాదనలో పసలేదు. ఆర్‌టిఐ చట్టసవరణలను ఉభయ సభలలో ఎలాంటి ఆరోగ్య కరమైన చర్చజరపకుండా ప్రభుత్వం ఆమోదింపచేసుకుంది. మొదటి నుండి ఈ చట్టసవరణలపై మేధావ్ఞలు విమర్శలు చేస్తూనేఉన్నారు.ఇందువలన దేశంలో సమాచారహక్కు స్ఫూర్తి అడుగంటుతుందన్న వారి వాదనలను ప్రభుత్వం పట్టించుకో లేదు.ఈ వ్యవహారంపైప్రజాక్షేత్రంలో సమగ్ర చర్చ జరిగిఉంటే ఇంకా బాగుండేది. ఆదరాబాదరాగా ఎలాంటి హేతుబద్ధత లే కుండాసవరణలపై ప్రభుత్వంనిర్ణయం తీసుకోవడంవలనసమా చార కమిషన్‌ వ్యవస్థను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నంచేసిందన్న వాదనలుమరింతగా బలపడుతున్నాయి.

విద్యార్థులకు అవగాహన కల్పించాలి: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

పండుగల పట్ల నేటితరం విద్యార్థులకు అవగాహన కల్పించితే రేపటి తరానికి వాటిని సంప్రదాయ పద్ధతిలో, పర్యావరణాని కి హాని లేని విధంగా జరుపుకోవడం తెలుస్తుంది. ముఖ్యంగా రానున్నవినాయక చవితి పండుగకి రసాయన రంగులు వాడిన ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన అవి భూమిని కలుషితం చేస్తున్నాయని, తద్వారా పంటలకు, జల చరాలకు హాని జరుగుతుందని తెలియచెప్పాలి. భక్తిపేరుతో మనం చేస్తున్న పర్యావరణహాని విషయాలు ఈతరం పిల్లలకి పాఠశాలలో తెలియచెపితే రాబోవ్ఞ తరాలలో ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటారు

రూ.10 నాణాలు ముద్రించవద్దు: -ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

కేంద్ర ప్రభుత్వం 1,2,5,10,20 రూపాయల నాణాలను ము ద్రించి వాడుకలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం 1,2,5 రూపాయ లు చెల్లుబడి అవ్ఞతుండగా రూ.10 నాణాలు చెల్లుబడి కావ డంలేదు.వందలకొద్ది పది రూపాయల నాణాలు వ్యాపారస్తుల వద్ద మారకం లేక నిలువ ఉండిపోయాయి. రిజర్వుబ్యాంకు రూ.10 నాణాలు చెల్లుబాటు అవ్ఞతాయని మీడియా ద్వారా ప్రకటించినా పరిస్థితిలో మార్పు రాలేదు. అందువల్ల ఇరవై రూపాయల నాణాలు ముద్రించడం వల్ల ప్రయోజనం లేదు.

పోపుల డబ్బా దోపిడీ: -డాక్టర్‌ డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ఇంట్లో అమ్మపోపుల డబ్బా నిర్వహిస్తూఉంటుంది. ఆ విషయం ఇంటి యజమాని నాన్నకు తెలిసినా పట్టించుకోడు. ఈ విష యంలో వేలుపెట్టడు.ఆ సొమ్ముపైఅట్టే ఆశపడడు. ఎందుకంటే దాని విలువ తెలుసుకాబట్టి. అత్యవసర వేళల్లో ఆదుకుంటుంది కాబట్టి.అమ్మస్వేచ్ఛకు అడ్డుతగలడు. అలాగే అమ్మలాగే రిజర్వు బ్యాంకు మిగులు నిధులుదాస్తుంది. సంవత్సరానికి ఒక యాభై వేల కోట్ల రూపాయల మేరకు యజమాని లాంటి ప్రభుత్వానికి సర్దుబాటు చేస్తూ వస్తుంది. మిగతా ధనం అట్టే పెట్టుకొని అవ సరమైన ఆర్థికనిర్వహణ చేస్తుంది. అందుకనే ఎన్ని ఒడిదుడుకు లు ఎదురైనా ఆర్థిక పరిస్థితి దివాలా తీసినా మనదేశం ఆర్థి కంగాపటిష్టత కోల్పోలేదు. అయితే ఈసారి మాత్రం మరీ లక్షా డెబ్భై ఆరువేల కోట్ల రూపాయల మిగులును ప్రభుత్వ ఖజానా కు బదిలీ చేయడం ఆశ్చర్యకరమే. అవసరం ఏర్పడినప్పుడు ఇవ్వాల్సిందే కానీ దాని వల్ల రిజర్వుబ్యాంకు బలహీనపడదా?

ప్రభుత్వ పాఠశాలలో అపారిశుద్ధ్య పరిస్థితులు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలో తీవ్ర అపారి శుద్ధ్య పరిస్థితులునెలకొని విద్యార్థుల పాలిట కంటకప్రాయంగా మారాయి. సర్వశిక్షా అభియాన్‌ పాఠశాలల గ్రాంట్లు, స్వచ్ఛ భారత్‌ కింద గతంలో నిర్మించిన పలు మరుగుదొడ్లు నాణ్యత లేనికారణంగా నిర్వహణవైఫల్యం కారణంగా శిథిలావస్థకు చేరు కొని ఎందుకూ ఉపయోగపడకుండాపోతున్నాయి. 70 శాతం పాఠశాలలో నీటి సరఫరా సక్రమంగా లేనందున వీటిని శుభ్రం చేసే పరిస్థితులు లేవ్ఞ. ఈ విషయమై ప్రజలు మండల కార్యా లయాలలో, పలుమార్లు విజ్ఞప్తులు సమర్పించినా అధికా రులు నిర్లక్ష్యం కనబరచడం బాధాకరం.

ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం: -సిి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వరంగ సంస్థల ను బలోపేతం చేసేవిధంగా చర్యలు చేపడుతుండగా మనదేశం లో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీ ర్యం చేసే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు చేపడుతుండడం దురదృష్టకరం. ప్రైవేట్‌ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా ప్రవే శించడానికి వీలుకల్పిస్తూ ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసే విధంగా ప్రభుత్వరంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉప సంహరణలపై ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచడం అనుచితం.