ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

కరెంటు కష్టాలు: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం
ధర్మల్‌,సోలార్‌,వాయు వంటి పలురకాలుగా విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా గత ప్రభుత్వంలో విద్యుత్‌ కోతలు లేకుండా గృహ వినియోగదారులతోపాటు రైతులు, కుటీరపరిశ్రమలు వారి పనులకు ఇబ్బందులు లేకుం డా చేశారు.జగన్‌ అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే కరెంట్‌ కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడుపోతుందో, ఎప్పుడు వస్తుం దో తెలియదు. ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలకు, చిన్న చిన్న పరిశ్ర మల్లో పనిచేసే వారికి, వ్యవసాయానికి సకాలంలో కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. అడ్డగోలు ఒప్పందాలు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని చంద్రబాబుపై నిందలు వేసే ముందు ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ నిరంతరం సరఫరా చేసే గత పాలకులను మరిపించే విధంగా పాలన సాగించాలి.

పచ్చదనం కనుమరుగు: -ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా
ఆధునిక సమాజం అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని సృష్టిస్తోంది. వివిధ అవసరాల కోసం విచ్చలవిడిగా వృక్షాలను నరికివేయ డం వల్ల అడవ్ఞల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోయి, పచ్చదనం కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది.తెలుగురాష్ట్రాల్లోస్మగ్లర్లు కలపదొంగలు అడవ్ఞలను కొల్లగొడుతున్నారు. మరోవైపు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో తీవ్రత పెచ్చరిల్లి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ మేల్కొవాల్సిన తరుణమిది. ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలను చేపట్టాలి.పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు జలసంరక్షణకు నడుంబిగించాల్సిన అవసరం ఉంది. సహజవనరుల సంరక్షణకై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన సమయమిది.ప్రస్తుతం చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్‌ తరా లకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేలా ఉండాలి.

మృత్యు భవనాలు:-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా
ముంబయి నగరం డొంగ్రీ ప్రాంతంలో పురాతన భవనం కుప్ప కూలి అనేక మంది మరణించారు. ముంబయి, హైదరాబాద్‌ తదితర నగరాలతోపాటు దేశవ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకు న్న భవనాలు అనేకం ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు. శిధిలావస్థకు చేరుకున్న భవ నాలను గుర్తించి నోటీసులు ఇస్తున్న అధికారులు, అంతటితో తమ బాధ్యత తీరిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. స్పందించని యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

రైతుల బకాయిలు చెల్లించాలి: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు
గత రబీలో రైతుల వద్దనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంది. అలాగే పెట్టుబడి రాయితీ, రుణాలపైవడ్డీ, వ్యవసాయ పరికరా ల కొనుగోళ్లపై ముదరా, పామాయిల్‌ రైతులకు అదనపు చెల్లిం పులు, రైతుబంధు వగైరాలు నెలల తరబడి చెల్లించకపో వడం శోచనీయం.పోలవరం,చింతలపూడి ప్రాజెక్టులకోసం సేకరించిన భూములకు అదనపు చెల్లింపులు చేస్తామని హామీలు ఇచ్చారు! ఆ హామీల ఊసు బడ్జెట్‌లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వాలు అనేకపథకాలు ప్రవేశపెట్టి వేలకోట్లు ఖర్చు చేస్తూ, రైతుల బకాయిలు చెల్లించకపోవడం సబబుకాదు. పాలకులు ఇప్పటికైనా స్పందించి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వివిధ పద్దుల కింద చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి.

విద్యారంగంలో వెనుకబడిన భారత్‌: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
భారత్‌ను మేధావుల సమాజంగా తీర్చిదిద్దడంలో ప్రాథమిక విద్యారంగానికి కీలక ప్రాధాన్యత ఉందని జాతీయ విజ్ఞాన సంఘం 2005లోనే కీలక సిఫార్సులు చేసింది. మానవ వనరులపై పెట్టుబడులు 2005లో 2.3 శాతం నుండి 7.1 శాతానికి దశాబ్దకాలంలో పెంచాలన్న కమిటీ సిఫార్సులు బుట్ట దాఖలు అయ్యాయి. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో 2.9శాతంమాత్రమే నిధులను కేటాయించడం ప్రాథ మిక,మాధ్యమిక విద్యారంగాలు, మానవవనరుల నైపుణ్యాభిµ వృద్ధిలో ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరిని స్పష్టం చేస్తోంది. దేశదేశాల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి యునెస్కో ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగంలోఫిన్లాండ్‌,డెన్మార్క్‌జర్మనీలతో పోలిస్తే యాభై సంవత్సరాలు వెనుకబడి ఉందని అంచనా వేసింది.

గరిష్ట స్థాయిలో నిరుద్యోగం:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా
స్వాతంత్య్రం సిద్ధించాక తొలిసారిగా నిరుద్యోగం గరిష్ట స్థాయికి అంటే 6.3 శాతానికి చేరిందన్న నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నిరుద్యోగుల సంఖ్య రెండు కోట్లుగా ఉంది. 2014లో అధికారం చేపట్టాక ఏడాదికి కోటి ఉద్యోగాలు,అయిదేళ్లలో అయిదు కోట్ల ఉద్యోగాలకల్పనతో నిరుద్యోగం అన్నదే లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అందులో 10 శాతం కూడా పూర్తి చేయలేక పోవడంవలన నిరుద్యోగ సమస్యనానాటికీ తీవ్రతరం అవ్ఞతోం ది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఏడాదికి కనీసం 81 లక్ష ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది.