భారత్‌ మార్కెట్‌కు వొడాఫోన్‌ గుడ్‌బై?

Vodafone
Vodafone

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ మొబైల్‌ కంపెనీ నష్టాలు పెరుగుతుండటంతో భారత్‌ మార్కెట్‌ నుంచే వైదొలగాలని భావిస్తోంది. టెలికాం రంగంలో ఇపుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. నిర్వహణ నష్టాలు పెరుగుతున్నాయి. జాయింట్‌ వెంచర్‌ కంపనీ వొడాఫోన్‌ ఐడియాలోకూడా ఏటికేడాది పెరుగుతుండటంతో భారత్‌ మార్కెట్‌నుంచి వైదొలగడమే మంచిదన్న భావనతో ఉంది. అలాగే రుణపునర్‌వ్యవస్థీకరణకు సైతం మేం ఎవ్వరినీ సంప్రదించలేదని, అవాస్తవాలతో కూడిన ప్రచారం మాత్రమేనని వెల్లడించింది. సంస్థాపరంగా తీసుకున్న రుణాలను సకాలంలోచెల్లిస్తామని బకాయిలు ఉన్నపుడు సైతం సకాలంలో స్పందిస్తామని వెల్లడించింది. కంపెనీ ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునుకూడా పరిగణనలోనికి తీసుకుంటున్నది. వొడాఫోన్‌ ఐడియా మూడునెలల్లోపు 28,309 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా. స్టాక్‌ మార్కెట్లలో భారీ పతనం దృష్ట్యా వొడాఫోన్‌ ఐడియా స్టాక్‌ఎక్ఛేంజిలకు ఈనెల 25వ తేదీనే వివరణ ఇచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/