వొడాఫోన్‌ రూ.20వేల కోట్ల రెట్రో పన్నుపై భారత్‌ సవాల్‌!

వొడాఫోన్‌ ఐడియాకు అనుకూలంగా తీర్పు

VODAFONE
VODAFONE

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ కంపెనీ చెల్లించాల్సిన రూ.20వేల కోట్ల రెట్రోస్పెక్టేటివ్‌ పన్నుకేసులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ తీర్పును భారత్‌ సవాల్‌ చేయనుంది.

ఈ మేరకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను న్యాయ సలహా కోరినట్లుగా తెలుస్తోంది. స్థానిక పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను దాటి ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పు ఇవ్వకూడదని తుషార్‌ మెహతా అన్నారు.

దిహెగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టు రెట్రోస్పెక్టేటివ్‌ కేసులో గత నెలలో వొడాఫోన్‌ ఐడియాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని భారత్‌ సవాల్‌ చేయనుంది.

ఆదాయపన్ను పన్ను శాఖ పారదర్శకంగా, సమానంగా చూడడంతో విఫలమైందని, వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధించడం సరికాదని ఆర్బిట్రేషన్‌ కోర్టు పేర్కొంది.

ఇది భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య ఉన్న పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమని వొడాఫోన్‌ వాదనలు వినిపించింది.

వొడాఫోన్‌ నుంచి బాకీల వసూలును తక్షణమే నిలిపివేయాలని, అలాగే కోర్టు ఖర్చుల కింద రూ.40వేల కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

పన్నులు, పెనాల్టీ, వడ్డీ రూ.22వేల కోట్లను వసూలు చేయడాన్ని నిలిపివేసింది. వొడాఫోన్‌ నుంచి బకాయిలు చేయకూడదని తెలిపింది.

2007లో భారత్‌లో టెలికం సేవలు అందిస్తున్న హచిసన్‌ ఈక్విటీలో 67శాతం వాటాను వొడాఫోన్‌ రూ.1100కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

దీనికి టిడిఎస్‌ కింద రూ.11వేల కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అప్పుడు నోటీసులు పంపించింది.

వొడాఫోన్‌ ఈ మొత్తం చెల్లించకపోవడంతో జరిమానా, వడ్డీ రూ.20వేల కోట్లకు పెరిగింది. రూ.12వేల కోట్ల వడ్డీ, రూ.7900కోట్ల పెనాల్టీ ఉంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/