లుహాన్స్క్ లో తమ సేనలు విజయం సాధించాయి : అధ్యక్షుడు పుతిన్

ఉక్రెయిన్ లో ఒక్కొక్క ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న రష్యా

Vladimir Putin declares victory in embattled Donbas region of Luhansk

మాస్కో: గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్​ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్​లోని లుహాన్స్క్‌ కూడా రష్యా బలగాల చేజిక్కిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ప్రకటించారు. లుహాన్స్క్ లో తమ బలగాలకు ఎదురైన ఆఖరి ప్రతిఘటనను కూడా అణచివేశామని, అక్కడి నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనుదిరిగాయని పుతిన్ కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు వివరించారు.

కాగా, తాజా పరిణామంతో ఉక్రెయిన్ పారిశ్రామిక ప్రాంతం డాన్ బాస్, డొనెట్స్క్ లతో పాటు లుహాన్స్క్ కూడా రష్యా వశమైంది. రష్యా సేనలు ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై తీవ్రస్థాయిలో దాడులు జరిపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీవ్ రష్యా పరమైతే యుద్ధం ముగిసినట్టేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/