వివేకా హత్య కేసులో సిట్‌ విచారణ తుది దశలో ఉంది

ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు

vivekananda reddy
vivekananda reddy

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాఫ్తుని సీబీఐకి ఇచ్చేలా ఆదేశించాలంటూ టిడిపి నేత బిటెక్‌ రవి బిజిపి నేత ఆదినారయణ రెడ్డి, వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్లపై హై కోర్టులో నేడు విచారణ జరిగింది. సౌభాగ్యమ్మ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 19లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని అడ్వకేటు జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అప్పటివరకూ తుది నివేదికను రూపొందించవద్దని సిట్‌కు సూచించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వకేటు జనరల్‌ వాదనలు వినిపించారు. ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ విచారణ చివరి దశలో ఉందన్నారు. ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

తాజా అంతార్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/