అంతర్జాతీయ సేవలు ప్రారంభించనున్న విస్తారా

Vistara
Vistara

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా త్వరలోనే అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తేనుంది. విస్తారా గ్రూప్‌ సంస్థ ఐఏటీఏ వార్షిక జనరల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో లెస్లీ థంగ్‌ మాట్లాడుతూ.. ఖవిమానయాన రంగంలో భారత్‌ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌. సుదీర్ఘకాలం ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నాం. 2019 రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నాంగ అని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/