యుఎస్‌కు విస్తారా నాన్‌స్టాప్‌ ఫ్లైట్స్‌

డైరెక్ట్‌ సర్వీసులను ప్రారంభించాలని యోచన

vistara nonstop flights to the US
vistara Air lines

ముంబై: కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్‌ సంస్త విస్తారా యుఎస్‌కు నాన్‌స్టాప్‌ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది.

ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ (జెవి) త్వరలో యుఎస్‌కు డైరెక్ట్‌ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ నేపథ్యలో నాన్‌స్టాప్‌ సర్వీసులకు భారీ డిమాండ్‌ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నాన్‌స్టాప్‌ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్‌ తెలియచేశారు.

ఇందులో విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023 కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యలో 20-30 వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా విమానాల సంఖ్యను 70కి పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియచేశాయి.

ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియచేశాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/